కర్నూలు జిల్లా నంద్యాలలో లవర్‌పై దాడిలో కొత్త కోణం చోటు చేసుకుంది. వేరే పెళ్లి చేసుకుంటున్నాడని ప్రియుడి మీద ప్రియురాలు యాసిడ్ దాడి చేసింది. నాగేంద్ర అనే యువకుడు సుప్రియతో ప్రేమాయాణం సాగించి వేరే అమ్మాయిని పెళ్లాడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు.
కొన్నాళ్ల పాటు సాగిన ప్రేమాయాణంలో సడెన్‌గా వేర్వేరు కులాలు అంటూ విడిపోదామని.. చెప్పేశాడు ఆ యువకుడు. ఆ తర్వాత వేరే పెళ్లి ప్రయత్నాల్లో ఉండగా యాసిడ్ దాడి జరిగిందని నాగేంద్ర హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు. దీనిపై సుప్రియ తల్లిదండ్రులు స్పందిస్తూ.. మా అమ్మాయి యాసిడ్ దాడి చేసింది వాస్తవమే కానీ, ఇప్పుడు కాదని చెప్తున్నారు.
తనకు తానే యాసిడ్ తో కాల్చుకుని ఇలా నాటకం ఆడుతున్నాడని చెప్తున్నారు. చదువుకుంటున్న అమ్మాయిన పెళ్లి చేసుకుందామని చెప్పి కాలేజి కూడా మాన్పించేశాడని వాపోతున్నారు. యాసిడ్ పోసిన ఘటనను కన్ఫామ్ చేస్తున్న సుప్రియ పేరెంట్స్ అదీ ఇప్పుడు కాదనడం గమనార్హం.