Brahmamgari Matam : నేటి నుంచి బ్రహ్మంగారి మఠంలోకి భక్తులకు ప్రవేశం

కడప జిల్లాలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి మఠంలోకి ఈ రోజు నుంచి భక్తులకు ప్రవేశం కల్పిస్తున్నారు. మఠం వారసత్యంపై జరుగుతున్న ఆధిపత్య పోరు కారణంగా దాదాపు నెలరోజుల నుంచి భక్తులకు దర్శనాలను నిలిపి వేశారు.

Brahmamgari Matam : కడప జిల్లాలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి మఠంలోకి ఈ రోజు నుంచి భక్తులకు ప్రవేశం కల్పిస్తున్నారు. మఠం వారసత్యంపై జరుగుతున్న ఆధిపత్య పోరు కారణంగా దాదాపు నెలరోజుల నుంచి భక్తులకు దర్శనాలను నిలిపి వేశారు.

నేటి నుంచి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బ్రహ్మంగారి మఠంలో భక్తులకు దర్శనాలకు అనుమతించారు. వసతి గృహాల కేటాయింపు, ఉచిత అన్నదాన కార్యక్రమాలను మరో పది రోజుల తర్వాత ప్రారంభిస్తామని మఠం ఫిట్ పర్సన్ శంకర్ బాలాజీ చెప్పారు.

వీరబ్రహ్మేంద్ర స్వామి జీవ సమాధిని దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. రెండు నెలలుగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల జీతభత్యాలను నేటి నుంచి వారి అకౌంట్లకు జమ చేస్తున్నామని…దాదాపు 12 లక్షల రూపాయల జీతభత్యాలను నేడు ఉద్యోగులకు వారి అకౌంట్లలో జమ చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

Read:Brahmamgari Matam : బ్రహ్మంగారి మఠం ఫిట్ పర్సన్ నియామకం, జీతాల కోసం సిబ్బంది ఎదురు చూపులు

ట్రెండింగ్ వార్తలు