Vijayawada Central MLA Malladi Vishnu
Malladi Vishnu : సీఎం జగన్ వైసీపీలో మార్పులు చేర్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పలు అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాల ఇంఛార్జిలను మార్చేస్తున్నారు. తాజాగా 27మంది ఇంఛార్జిలతో వైసీపీ రెండో జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లావి విష్ణుకు షాక్ ఇచ్చారు జగన్. సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ నిరాకరించారు. ఆ స్థానాన్ని వెల్లంపల్లి శ్రీనివాస రావుకి కేటాయించారు.
మల్లాది విష్ణుకు సీఎం జగన్ టికెట్ నిరాకరించడం హాట్ టాపిక్ గా మారింది. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు ఆలిండియా బ్రాహ్మణ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య మద్దతుగా నిలిచింది. విజయవాడలో మీడియాతో సమావేశం నిర్వహించారు.
సెంట్రల్ నియోజకవర్గం బ్రాహ్మణుల సీటు అని వైసీపీ కార్పొరేటర్ శార్వాణి మూర్తి అన్నారు. ఎందుకు మార్చారో.. ముఖ్యమంత్రి జగన్ పునరాలోచన చేయాలన్నారు. బ్రాహ్మణులను తొక్కేయాలని చూస్తున్నారని ఆరోపించారు. సెంట్రల్ నియోజకవర్గంలో 45వేల మంది బ్రాహ్మణులు ఉన్నారని శార్వాణి మూర్తి అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎప్పుడూ బ్రాహ్మణులే పోటీ చేస్తారని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణులు మీటింగ్ పెట్టుకుని మా కార్యచరణ ప్రకటిస్తామన్నారు.
Also Read : మరో సంచలనం.. టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య, విజయసాయి రెడ్డి బంధువులు
”బ్రాహ్మణులు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు శాతం ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మాకు నాలుగు సీట్లు కేటాయించాలి. గతంలో వైఎస్ఆర్ కూడా బ్రాహ్మణులకు ప్రాముఖ్యత ఇచ్చారు. మా ప్రతినిధి ఒకరు అసెంబ్లీలో ఉంటే సమస్యలను పట్టించుకుంటారు. గతంలో టీడీపీలో ఎంపీ ఇచ్చి కేంద్రమంత్రిని చేశారు. టీడీపీ, జనసేన పార్టీలు రాష్ట్రంలో గెలిచే వారికి సీట్లు కేటాయించాలి. వచ్చే ఆదివారం విజయవాడలో బ్రాహ్మణులంతా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తాం” అని శార్వాణి మూర్తి తెలిపారు.
ద్రోణంరాజు రవి, బ్రాహ్మణ సంఘం నాయకుడు
”గతంలో రాష్ట్రంలో 36మంది ఎమ్మెల్యేలు ఉండే వారు. ఇప్పుడు ఇద్దరికి వచ్చాం. భవిష్యత్తులో రాజకీయ పార్టీలు ఎలా వ్యవహరిస్తారో చూడాలి. మల్లాది విష్ణుకు వైసీసీ సెంట్రల్ సీటు ఇవ్వాలి. కార్పొరేషన్ ఎన్నికల్లో మల్లాది విష్ణు 18 మంది కార్పొరేటర్లను గెలిపించారు. మాకు గెలించే సత్తా ఎంత ఉందో.. ఓడించే సత్తా కూడా ఉంది. ఈ ప్రజాస్వామ్యంలో మాకు కూడా హక్కులు కల్పించండి. మేము వద్దు మా ఓటు వద్దు అంటే చెప్పాలి. మరోసారి పునరాలోచన చేసి మల్లాది విష్ణుకి విజయవాడ సెంట్రల్ కేటాయించాలి.
Also Read : షర్మిల నిర్ణయంతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
తెలుగుదేశం పార్టీపై యుద్ధం చేసిన వ్యక్తిని ఇలా చేయడం చాలా బాధేసింది. మల్లాది విష్ణుపై ఎలాంటి అవినీతి ఉందో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. మల్లాది విష్ణు ఇసుక దందా చేశారా? మద్యం మాఫియా చేశారా? ప్రభుత్వం చెప్పాలి. రాష్ట్రంలో తండ్రులకు పార్టీ టిక్కెట్లు ఇవ్వకుండా వాళ్ళ కుమారులకు ఇస్తున్నారు. ఇలా అయితే మల్లాది విష్ణు కుమార్తెకు కానీ వాళ్ళ భార్యకు కానీ టిక్కెట్ ఇవ్వండి. మాకు సమస్యలు వస్తే ఎవరికి చెప్పుకోవాలో మీరే చెప్పండి”.