YS Jagan: వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దు

శ్రీవారి లడ్డూ వివాదం వేళ జగన్ తిరుమల పర్యటన చేస్తాననడంతో దీనిపై హిందూ సంఘాలు, పలువురు నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు.

Ys Jagan

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ తిరుమల తిరుపతి పర్యటన రద్దయింది. శ్రీవారి లడ్డూ వివాదం వేళ జగన్ తిరుమల పర్యటన చేస్తాననడంతో దీనిపై హిందూ సంఘాలు, పలువురు నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో ఆయన పర్యటన రద్దయినట్లు తెలుస్తోంది.

తిరుమల తిరుపతిలో జగన్ డిక్లరేషన్ ఇవ్వాలని చాలా మంది నేతలు డిమాండ్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ట్వీట్ చేస్తూ.. టీటీడీ నిబంధనలను తప్పక పాటించాలని కోరుతున్నానని, భక్తుల మనోభావాలకు, ఆలయ ఆచారాలకు భిన్నంగా ఎవరూ వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.

ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం తిరుమల శ్రీవారి దర్శనార్థం ఇవాళ సాయంత్రం 4.50 గంటలకు రేణిగుంట విమానాశ్రయాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేరుకుని, అనంతరం రోడ్డు మార్గాన బయలుదేరి 7 గంటలకు తిరుమలకు చేరుకోవాల్సి ఉంది. రేపు ఉదయం 10.30 గంటలకు స్వామి వారిని దర్శించుకోవాలని జగన్ అనుకున్నారు. చివరకు ఇది రద్దయింది.

అక్టోబర్ 3నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు.. అమ్మవారు ఏరోజు ఏ అలంకారంలో దర్శనమిస్తారంటే?