Prakasam District : జంబలకిడి పంబ-వధువుగా అలంకరించుకున్న వరుడు

ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం గొట్లగట్టు గ్రామానికి చెందిన నాలి రామయ్య కుమారుడు యోగేంద్ర బాబుకు వివాహం కుదిరింది. తమ వంశ ఆచారంలో భాగంగా   వరుడు ,  పెళ్లి కూతురు అవతారమెత్తాడు.

Prakasam District : జంబలకిడి పంబ-వధువుగా అలంకరించుకున్న వరుడు

Prakasam District

Updated On : April 19, 2022 / 10:22 AM IST

Prakasam District :  నాగరికత ఎంత మారిన వంశ,కుల ఆచారాలను ప్రజలు నేటికీ ఆచరిస్తున్నారు అనటానికి ఈ సంఘటనే ఉదాహరణ. దర్జాగా పెళ్లి మండపానికి వెళ్ళవలసిన పెళ్ళికొడుకు, పెళ్లికూతురు అవతారమెత్తాడు. అంతే కాదండోయ్ కుటుంబ సభ్యులు మేళతాళాలతో సంబరాలు జరుపుకుంటూ వాళ్ల కుల దైవం వద్దకు తీసుకువెళ్లారు.

వారి వంశపారంపర్యంగా వస్తున్న ఆచారాలలో భాగంగా ఈ వేడుక నిర్వహించారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం గొట్లగట్టు గ్రామానికి చెందిన నాలి రామయ్య కుమారుడు యోగేంద్ర బాబుకు వివాహం కుదిరింది. తమ వంశ ఆచారంలో భాగంగా   వరుడు ,  పెళ్లి కూతురు అవతారమెత్తాడు.
Also Read : Tiger Nageswara Rao: మాస్ రాజాకి గజదొంగ స్టోరీ ట్రాక్ ఎక్కిస్తుందా?
ప్యాంటు షర్టు కు బదులు చీర జాకెట్ ధరించి బారెడు విగ్గు పెట్టుకొని తలనిండా పూలు ధరించాడు. అచ్చం పెళ్లికూతురులా ముస్తాబై తమ ఇంటి ఇలవేల్పు అయినా గురప్ప స్వామికి మొక్కు సమర్పించాడు. వారి ఆచారాలలో పెళ్లికూతురిని పెళ్ళికొడుకుగాను, పెళ్లి కొడుకు పెళ్లికూతురు గాను అలంకరించి స్వామివారికి మొక్కులు తీర్చుకుంటారు. అనాదిగా వస్తున్న ఈ సంస్కృతిని కొనసాగిస్తున్నామని పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు అన్నారు.