Brither Anil Kumar
Brother Anil Kumar: విజయవాడలోని ప్రైవేట్ హోటల్లో క్రిష్టియన్ మైనారిటీ సంఘాల నేతలతో మాట్లాడారు బ్రదర్ అనిల్ కుమార్. ఈ మేరకు కొత్త పొలిటికల్ పార్టీ పెట్టే ఆలోచనే లేదని అవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశారు. అటువంటిదేమైనా ఉంటే వివరాలను ముందుగా మీకే వెల్లడిస్తానని వివరించారు.
మీటింగ్ లో పలువురు సంఘనాయకులతో చర్చించారు. ఈ సందర్భంగా బీసీ వెల్ఫేర్ సంఘం నాయకులు శోంఠి నాగరాజు.. బ్రదర్ అనిల్ కుమార్ తో మాట్లాడిన విషయాలను తెలిపారు.
‘వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మేం సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నాం. అప్పట్లో బ్రదర్ అనిల్ మాతో సమావేశాల్లో పాల్గొని చెప్పడం వల్లే వైసీపీకి ఓటు వేసి గెలిపించాం’
Read Also : కేసీఆర్‌కు ఏపీ మంత్రి అనిల్ కుమార్ కౌంటర్ !
‘మా సమస్యలు చెప్పుకోవడానికి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీ అవసరమని బ్రదర్ అనిల్‌కు తెలియజేశాం’
‘మేం చెప్పిన దానికి పూర్తిగా విని సానుకూలంగా స్పందించి తగు నిర్ణయం తీసుకుంటా’మని బ్రదర్ అనిల్ చెప్పారు.