ఏపీలో కరోనా వైరస్ నిరోధక చర్యలపై బులిటెన్ విడుదల చేశారు. ఏపీలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి అన్నారు.
ఏపీలో కరోనా వైరస్ నిరోధక చర్యలపై బులిటెన్ విడుదల చేశారు. కరోనా ప్రభావిత దేశాల నుంచి 466 ప్రయాణికులు ఏపీకి వచ్చారు. 234 ప్రయాణికులు ఇళ్ల వద్ద వైద్యుల పరిశీలనలో ఉన్నారు. 226 మందికి 28 రోజుల పరిశీలన పూర్తి అయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురి ఆరోగ్య పరిస్థితి స్థిమితంగానే ఉంది.
36 మంది నమూనాలను ల్యాబ్ కు పంపగా వీరిలో 34 మందికి నెగెటివ్ రిపోర్టు వచ్చింది. మిగిలిన ఇద్దరి శాంపిళ్లకు సంబంధించి రిపోర్టులు పెండింగ్ లో ఉన్నాయి. ఏపీలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి అన్నారు.
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 4 వేల 9కి చేరింది. లక్షా 14 వేల 285 మంది కరోనా బాధితులు ఉన్నారు. 6 వేల 88 మందికి సీరియస్ గా ఉంది. 113 దేశాలకు వైరస్ పాకింది. కరోనా వైరస్ చైనాలో తగ్గి ఇతర దేశాల్లో పెరుగుతోంది.
ఇటలీలో నిన్న ఒక్కరోజే 1797 కేసులు నమోదు అయ్యాయి. 97 మంది మృతి చెందారు. ఇరాన్ లో నిన్న 595 కేసులు నమోదు అయ్యాయి. 43 మంది మృతి చెందారు. చైనాలో కేవలం 4 కేసులు నమోదు అయ్యాయి. ఒకరు మృతి చెందారు. (మద్యంతో కరోనా నయమవుతుందంటూ ప్రచారం.. నాటుసారా తాగి 27 మంది మృతి)
భారత్‌లో కరోనా కేసులు 47కు చేరాయి. 40 కేసులు ఇంకా ట్రీట్‌మెంట్ దశలోనే ఉన్నప్పటికీ కేరళలోని ముగ్గురికి చికిత్స పూర్తయి కోలుకున్నారు. కరోనా పేషెంట్ల కోసం భారత దేశవ్యాప్తంగా 52 టెస్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. Covid-19 లక్షణాలు ఏం కనిపించినా కింది సెంటర్లలో సంప్రదించాలని వైద్యులు అంటున్నారు.