Water Bottle: వాటర్ బాటిల్ అడిగితే యాసిడ్ బాటిల్ ఇచ్చిన వ్యాపారి

ఒకే సొసైటీలో బతుకుతున్న మనలో మనకే ఒకరి ప్రాణంపై మరొకరికి బాధ్యత ఉండాలి. ప్రాణాలు కాపాడే వృత్తిలో ఉన్న డాక్టర్లు, రక్షణ కల్పించే పోలీసులు అని కాదు. సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యత..

Water Bottle: ఒకే సొసైటీలో బతుకుతున్న మనలో మనకే ఒకరి ప్రాణంపై మరొకరికి బాధ్యత ఉండాలి. ప్రాణాలు కాపాడే వృత్తిలో ఉన్న డాక్టర్లు, రక్షణ కల్పించే పోలీసులు అని కాదు. సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యత నెరవేరిస్తేనే ప్రశాంతంగా బతకగలిగేది. ఇటీవల ఓ వ్యాపారి చూపించిన నిర్లక్ష్యానికి దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు ఆ విద్యార్థి.

విజయవాడ ఎనికేపాడులో ఓ డిగ్రీ విద్యార్థి మంచి నీటి బాటిల్ కోసం వస్తే ఏమరుపాటుతో ప్రవర్తించాడు ఆ వ్యాపారి. మంచినీళ్లకు బదులుగా యాసిడ్ బాటిల్ ఇవ్వడంతో అసలే దాహంతో ఉండి అక్కడకు వచ్చిన చైతన్య అనే స్టూడెంట్ బాటిల్‍‌ను ఓపెన్ చేసి వెంటనే తాగేశాడు. యాసిడ్ అని ఇద్దరికీ తెలియకపోవడంతో కాసేపటికే అస్వస్థతకు గురయ్యాడు.

వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లగా.. అంతర్గత అవయవాలపై తీవ్ర ప్రభావం చూపించిందని చికిత్స మొదలుపెట్టారు. లయోల కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి పరిస్థితికి జాలిపడిన కాలేజీ యాజమాన్యం, తోటి విద్యార్థులు విరాళాలు సేకరించి చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నారు.

Read Bottle: ప్లాస్టిక్ బాటిల్ వాటర్ ఎంత డేంజరో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు