Byreddy Siddharth Reddy
Byreddy Siddharth Reddy: కర్నూలు జిల్లాలో ఛరిష్మా ఉన్న యువనేతల్లో ఒకరు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి.. యూత్‌లో, సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి వైసీపీ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల్లో కీలక పదవి దక్కింది. ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ(SAAP) చైర్మన్‌గా సిద్ధార్థ్‌ను నియమిస్తూ కీలక ఉత్తర్వులు ఇచ్చింది.
2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ గెలుపులో కీలకపాత్ర పోషించిన బైరెడ్డికి అప్పట్లో జగన్ మోహన్ రెడ్డి కీలక పదవి ఇస్తానంటూ హామీ ఇచ్చారు.
పాదయాత్ర సమయంలో నందికొట్కూరు ప్రచార సభలో మాట్లాడిన జగన్.. బైరెడ్డి తన మనసులో ఉన్నాడని ఖచ్చితంగా మంచి ప్రాధాన్యత గల పోస్ట్ ఇస్తానన్నారు. అప్పుడు జగన్ ఇచ్చిన హామీని ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల భర్తీలో భాగంగా నెరవేర్చారు. బైరెడ్డికి పదవి దక్కడంతో అభిమానులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోస్టుల భర్తీలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56శాతం పదవులు కేటాయించారు. 135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67 పదవులు ఇచ్చినట్లుగా ఆ పార్టీ ప్రకటించింది.