Byreddy Siddharth Reddy: మీరు సీఎం జగన్‌కి భయాన్ని పరిచయం చేస్తారా?: బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఎద్దేవా
ఏపీలో ఉండకుండా లోకేశ్ ఢిల్లీలో ఎందుకున్నారో అందరికీ తెలుసని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి చెప్పారు.
- T Venkateshwarlu
- Updated on- September 28, 2023 / 08:39 PM IST
Byreddy Siddhartha Reddy
Byreddy Siddharth Reddy: టీడీపీ నేతలపై శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. గుంటూరులో గణేశ్ నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
సీఎం జగన్ కి భయాన్ని పరిచయం చేస్తామని అవినీతిలో కూరుకుపోయిన వారు అంటుండడం హాస్యాస్పదంగా ఉందని బైరెడ్డి అన్నారు. ఏపీలో ఉండకుండా లోకేశ్ ఢిల్లీలో ఎందుకున్నారో అందరికీ తెలుసని చెప్పారు. చంద్రబాబు నాయుడు చేసిన స్కాముల్లో స్కిల్ డెవలప్మెంట్ చాలా చిన్నదని చెప్పుకొచ్చారు.
అమరావతి రాజధాని భూములులో, ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన్మెంటు విషయంలో చాలా పెద్ద దోపిడీ జరిగిందని అన్నారు. అప్పట్లో లోకేశ్ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖల మంత్రిగా ఉన్నారని చెప్పారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురందేశ్వరి వైఖరి ఏంటని ఆయన నిలదీశారు.
ఆమె టీడీపీ వైపు ఉన్నారా? బీజేపీ వైపు ఉన్నారా? అన్న విషయాన్ని తేల్చి అప్పుడు తమను విమర్శించాలని అన్నారు. అవినీతికి పాల్పడి చంద్రబాబు నాయుడు జైలుకు వెళితే, ఆయన చేసిన స్కాంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించడం లేదో అర్థం కావటంలేదని చెప్పారు. చంద్రబాబు అరెస్టును తప్పుబట్టే పవన్ కు ఈ స్కాంలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
