Tirupati Pakala Katpadi Railway Line : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు వరకు తిరుపతి-పాకాల-కాట్పాడి సింగిల్ రైల్వే లైన్ సెక్షన్ డబ్లింగ్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇది మొత్తం 104 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఇందుకోసం రూ.1332 కోట్లు ఖర్చు చేయనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ వివరాలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
ఈ ప్రాజెక్ట్ ప్రయాణ సౌలభ్యాన్ని మెరుగుపరుస్తుందని, లాజిస్టిక్ ఖర్చును తగ్గిస్తుందని కేంద్రం తెలిపింది. దీంతో చమురు దిగుమతులను తగ్గించడంతో పాటు, తక్కువ CO2 ఉద్గారాలకు దోహదం చేస్తుందని పేర్కొంది.
”తిరుపతి-పాకాల-కాట్పాడి డబ్లింగ్ పనులతో పర్యాటకంగా ఎంతో అభివృద్ధి జరిగేందుకు ఆస్కారం ఉంటుంది. తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయానికి నిలయమైన తిరుపతికి కనెక్టివిటీ పెరగడంతో పాటు ఇతర ప్రముఖ ప్రదేశాలు శ్రీకాళహస్తి, కాణిపాకం, చంద్రగిరికి రైలు కనెక్టివిటీ పెరుగుతుంది. దీంతో దేశవ్యాప్తంగా యాత్రికులు, పర్యాటకులు కూడా పెరుగుతారు. తిరుపతి-వెల్లూరు మార్గం వైద్య, విద్య పరంగా ఎంతో కీలకం.
Also Read : ట్రంప్ మరో దెబ్బ..! ఈసారి ఫార్మా రంగంపై టారిఫ్‌లు..? హైదరాబాద్ కంపెనీలపై భారీ ఇంపాక్ట్..?
తిరుపతి-పాకాల-కాట్పాడి డబ్లింగ్ పనులతో 400 గ్రామాల్లోని 14 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుంది. 35 లక్షల పని దినాలతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి. ఏడాదికి 4 మిలియన్ టన్నుల సరకు రవాణాకు అవకాశం ఉంటుంది. ప్రధానమంత్రి ఆత్మనిర్భర్, న్యూ ఇండియా విజన్ కు ఈ నిర్ణయం మరింత ఊతమిస్తుంది. ఈ మల్టీ ట్రాకింగ్ ప్రతిపాదన రైల్వే కార్యకలాపాలను సులభతరం చేస్తుంది. రద్దీని తగ్గిస్తుంది. భారతీయ రైల్వేలలో అత్యంత రద్దీగా ఉండే మార్గాలలో అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిని అందిస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఆ ప్రాంతంలో ఉపాధి అవకాశాలను పెంచుతుంది.
బొగ్గు, వ్యవసాయ వస్తువులు, సిమెంట్, ఇతర ఖనిజాలు వంటి వస్తువుల రవాణాకు ఇది ఒక ముఖ్యమైన మార్గం. డబ్లింగ్ తో 4 MTPA (సంవత్సరానికి మిలియన్ టన్నులు) పరిమాణంలో అదనపు సరుకు రవాణా జరుగుతుంది. రైల్వేలు వాతావరణ లక్ష్యాలను సాధించడంలో, లాజిస్టిక్స్ ఖర్చును తగ్గించడంలో, చమురు దిగుమతిని తగ్గించడంలో, CO2 ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడతాయి’’ అని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
Also Read : సత్యవేడులో అగమ్య గోచరంగా టీడీపీ పరిస్థితి.. తెలుగు తమ్ముళ్ల డిమాండ్ ఏంటి..
💠#Cabinet approves doubling of Tirupati-Pakala-Katpadi single railway line Section (104 km) in Andhra Pradesh and Tamil Nadu with total cost of Rs.1332 crore
💠Multi-tracking project will enhance connectivity to approx.400 villages and about 14 lakh population
Read here:… pic.twitter.com/Em7znnGXtM
— PIB India (@PIB_India) April 9, 2025