వరదలో చిక్కుకున్న కారు..కొట్టుకపోయిన తండ్రి, కూతురు

  • Publish Date - October 23, 2020 / 12:37 PM IST

Car caught in flood..father and daughter washed away In Chittoor : తెలుగు రాష్ట్రాల్లో వరదలు సృష్టించిన బీభత్సం అంతాఇంత కాదు. ఆస్తి, ప్రాణ నష్టం భారీగానే సంభవించింది. కాలనీలు, గ్రామాలు, పంటలు నీట మునిగిపోయాయి. రహదారులపై వరద నీరు పోటెత్తింది. కానీ..కొంతమంది నిర్లక్ష్యంగా దాటుతూ..ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.



తాజాగా..ఓ పెళ్లికి హాజరై..తిరిగి ఇంటికి వస్తుండగా..వాగు నీటిలో కారు చిక్కుకపోయింది. దీంతో తండ్రి, కూతురు వరద నీటిలో కొట్టుకపోయారు. ఇందులో కూతురు మృతి చెందగా..తండ్రి కోసం గాలిస్తున్నారు. కలికిరి చెరువు వద్ద ఆమె మృతదేహాన్ని గుర్తించారు.

గత రాత్రి పెనుమూరు కు చెందిన వారు..ఓ వివాహానికి ఐదుగురు హాజరయ్యారు. కారులో వీరు వెళుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి డ్రైవ్ చేస్తున్నాడు. ప్రతాప్, భార్య శ్యామల, కుమార్తె సాయి వినీత, బంధువు చిన్పప్పలు ప్రయాణిస్తున్నారు. తిరిగి రాత్రి ఇంటికి బయలుదేరారు. 2020, అక్టోబర్ 22వ తేదీ బుధవారం అర్థరాత్రి కొండయ్యగారిపల్లె వద్ద ఓ చెరువును దాటే ప్రయత్నం చేశారు.



నీటి ప్రవాహాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోయాడు డ్రైవర్ కిరణ్. మెల్లిగా కారు కొట్టెకపోవడం స్టార్ట్ అయ్యింది. కిరణ్, ప్రతాప్, శ్యామలు బయటపడ్డారు. కూతురును కాపాడే ప్రయత్నం చేశాడు ప్రతాప్. కానీ ప్రవాహం ఎక్కువ కావడంతో కారులో నుంచి వారిద్దరూ కొట్టుకపోయారు. కళ్లెదుటే తమ వారు కొట్టుకపోతుండడం చూసి వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.



విషయం తెలుసుకున్న అధికారులు ప్రతాప్, వినూతల కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. చిత్తూరు ఎమ్మెల్యే స్వయంగా రంగంలోకి దిగా..లైఫ్ జాకెట్ ధరించి గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. కలికి చెరువు వద్ద వినూత్న మృతదేహం బయటపడింది. తండ్రి ప్రతాప్ కోసం గాలిస్తున్నారు. తొందరగా వెళ్లే ప్రయత్నంలో వాగు దాటే ప్రయత్నం చేయడంతో ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. ప్రమాదం నుంచి బయటపడిన శ్యామల కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.