East Godavari Accident : అర్ధరాత్రి కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు మృతి
ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ఉన్నారు. ఈ ప్రమాదం నుంచి ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు.
- bheemraj
- Updated on- August 6, 2023 / 10:58 AM IST
East Godavari Accident
East Godavari Accident Three Died : తూర్పుగోదావరి జిల్లాలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కోరుకొండ మండలం బూరుగుపూడిలోని కాలువలోకి ఓ కారు దూసుకెళ్లింది. ముగ్గురు మృతి చెందారు. మారేడుమిల్లి నుంచి ఏలూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కల్వర్టు పైకి ఎక్కబోయి అదుపుతప్పి కారు కాలువలోకి దూసుకెళ్లింది.
ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ఉన్నారు. ఈ ప్రమాదం నుంచి ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. మరో ముగ్గురు మృతి చెందారు. నీటిలో గల్లంతయ్యారు. ముగ్గురి మృతదేహం లభ్యం అయ్యాయి. ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్రేన్ తో సహాయక చర్యలు చేపట్టారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మారేడుమిల్లిని చూసేందుకు నిన్న ఉదయం ఏలూరు నుంచి ఆరుగురు బయలుదేరారు. వీరు ఏలూరు ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. మారేడుమిల్లి తదతర ప్రాంతాలు చూసి తిరుగు ప్రయాణం అయ్యారు.
రాత్రి 11 గంటల సమయంలో కోరుకొండ దాటుతుండగా ప్రమాదం జరిగింది. కల్వర్టు పైకెక్కే క్రమంలో కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. కాలువ లోతుగా ఉండటంతో కారు పూర్తిగా మునిగిపోయింది. పోలీసులు క్రేన్ సహాయంతో కారును బయటికి తీశారు. వీరందరూ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు.
Darsi Road Accident: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. శుభకార్యానికి వెళ్తుండగా ఘటన
వీరు 19-20 ఏళ్ల లోపు ఉన్న విద్యార్థులు. కేవలం మారేడుమిల్లిని చూసి వచ్చేందుకు వచ్చారు. ఈ ప్రమాదం నుంచి ప్రణీత్, వంశీ, హేమంత్ సురక్షితంగా బయటపడ్డారు. ఉదయ్ కిరణ్, టి.హేమంత్, హర్షవర్ధన్ మృతి చెందగా, వారి మృతదేహాలు లభ్యం అయ్యాయి. గజ ఈత గాళ్లతో గాలింపు చర్యలు చేపట్టి, మృతదేహాలను వెలికి తీశారు.
