Case Registered Against Somireddy In Krishnapatnam Ps
Anandaiah : నెల్లూరు జిల్లా ఆనందయ్య మందుపై అధికార విపక్షాల సభ్యుల మధ్య మాటాల తూటాలు పేలుతూనే ఉన్నాయి. వ్యవహారం మరింత ముదురుతోంది. మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కృష్ణపట్నం పోర్టు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదయ్యింది.
సేశ్రిత టెక్నాలజీ ఎండీ నర్మదరెడ్డి సోమిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు సోమిరెడ్డిపై చీటింగ్, పోర్జరీ, దొంగతనం కింద కేసు నమోదు చేశారు. ఆనందయ్య మందుపై సోమిరెడ్డి తమ సంస్ధపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని నర్మదరెడ్డి పోలీసులకు చేసిన ఫిర్యాదులో వివరించారు.
మా అనుమతి లేకుండా మా డేటాను చోరీ చేశారని.. మా సంస్ధ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని నర్మదరెడ్డి ఆరోపించారు. ఆనందయ్య మందు పంపిణీకి అవసరమైన కంప్యూటర్ ప్రోగ్రాం రెడీ చేస్తున్నామని, దాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదని ఆయన తెలిపారు.
ఆనందయ్య స్వఛ్చందంగా ఎలాగైతే అందరికీ ఆరోగ్యం చేకూరాలని మందు తయారు చేసి ఇస్తున్నారో … తాము కూడా అందరికీ మందు చేరువ కావాలనే లక్ష్యంతోనే పంపిణీకి వెబ్ సైట్ రూపోందిచాలనుకున్నామని.. ఇంకా అది పూర్తికాకుండానే సోమిరెడ్డి ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు.
వెబ్ సైట్ లో మందు పంపిణీకి రేట్లు ప్రకటించటంపై ఆయన స్పందిస్తూ… ఫ్రైట్ చార్జీల కోసం అప్లికేషన్ లో రూపోందించామని ఎవరైనా స్పాన్సర్ వస్తే అదికూడా తీసేస్తామని తెలిపారు. మందు పంపిణీ విషయమై ఆనందయ్య గారిని కలవలేదని నర్మద రెడ్డి చెప్పారు. స్ధానిక ఎమ్మెల్యే గారికి సమచారం చెప్పాలి కాబట్టే ఆయనకు వివరించామని, కాకాణి గోవర్ధన రెడ్డికి మా సంస్ధకు ఎటువంటి సంబంధం లేదని నర్మద రెడ్డి చెప్పారు.