CBI inquiry on Antarvedi: సిఎం జగన్ దూకుడు పెంచారు. ఒక్కదెబ్బతో తన పార్టీ, ప్రభుత్వంపై వస్తున్న అన్ని మతపరమైన దుష్ఫ్రచారాన్ని అడ్డుకోవడానికి సిబిఐని అస్త్రంలా వాడుకోవాలనుకొంటున్నారు. అసలు ప్రభుత్వంపై మతపరంగా కుట్రజరుగుతోందని జగన్ భావిస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఇప్పటిదాకా చిన్నఘటనల ఆధారంగా మతవివాదాలను రాజేయడానికి విపక్షం ముఖ్యంగా టీడీపీ ప్రయత్నిస్తోందని వైసీపీ నాయకులు భావిస్తున్నారు. అందుకే ఈ దుష్ప్రాచారమంతటినీ సిబిఐ విచారణ పరిధిలోకి తీసుకొనిరావాలని అనుకొంటోంది వైసీపీ .
అంతర్వేది ఘటనతోపాటు, తిరుమల బస్సుపై శిలువబొమ్మలు, టీటీడీ వెబ్‌సైట్, సప్తగిరి మాసపత్రికలో అన్యమత ప్రస్తావన వంటివాటిని సిబిఐ పరిధిలోకి తీసుకురాబోతున్నారు. పిఠాపురం, నెల్లూరు ఘటనలతోపాటు, టీడీడీ ఛైర్మన్‌పై చేసిన దుష్ప్రచారాన్ని సిబిఐతో విచారణ జరిపించాలనుంటున్నారు. అంటే మతపరమైన అన్ని వివాదాలపై సిబిఐ ఎంక్వైరీ అంటే ఒక్క దెబ్బతో అన్నింటికి సమాధానం చెప్పే అవకాశం వైసీపీకొస్తుంది.
ఇప్పటిపై సిబిఐ ఎంక్వైరీతో కేంద్రంమీదకే భారంనెట్టి, ఏపీ బీజేపీ, బాబుకు ఎలాంటి రాజకీయ ఆయుధం లేకుండా చేసిన జగన్, మతవివాదాలన్నింటికీ ఒకేసారి పుల్‌స్టాఫ్ చెప్పాలనుకుంటున్నారు.