CBI: కడపలో 84వ రోజు వివేకా హత్య కేసు సీబీఐ విచారణ

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో 84వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా సీబీఐ విచారణ సాగుతోంది.

Viveka (1)

CBI: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో 84వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా సీబీఐ విచారణ సాగుతోంది. ఇప్పటికే విచారణకు పలువురు ముఖ్యమైన వ్యక్తులను పిలిచిన సీబీఐ, వివేకా డ్రైవర్ దస్తగిరిని కూడా విచారించారు. ఈ క్రమంలోనే వివేకానంద రెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్ ఆనంద నాయక్‌ను విచారించింది సీబీఐ.

మరోమారు పోస్టుమార్టం నివేదికను ఆనంద నాయక్ ద్వారా పరిశీలించిన సీబీఐ అధికారులు.. గాయాల తీవ్రత లోతు, వెడల్పు వంటి అంశాలపై లోతుగా విచారించారు. పగతో చంపితే ఎటువంటి గాయాలవుతాయి. ప్లాన్ చేసి చంపితే ఎలాంటి గాయాలవుతాయి. అనే పలు విషయాలపై విచారణ జరిపారు.

గాయాల స్వభావాన్ని బట్టి హత్యకు ఎటువంటి ఆయుధాలను ఉపయోగించి ఉంటారు, అన్న కోణంలో రిమ్స్ డాక్టర్ ఆనంద బాబు నాయక్‌ను విచారించినట్లుగా తెలుస్తోంది.