ఒక్క రాజధాని ఉండాలని విభజన చట్టంలో లేదు – కేంద్ర హోం శాఖ

  • Publish Date - September 10, 2020 / 11:28 AM IST

Andhra Pradesh 3 Capitals: ఒకే రాజధాని ఉండాలని విభజన చట్టంలో లేదు..రాజధానుల అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది..అంటూ కేంద్ర హోం శాఖ కీలక వ్యాఖ్యలు చేసింది.




మూడు రాజధానుల అంశంపై హైకోర్టులో కేంద్రం అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధానికి ఆర్థిక సహాయం మాత్రమే కేంద్రం చేస్తుందని వెల్లడించింది. ఇప్పటికే ఇదే విషయాన్ని కేంద్రం వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఏపీ రాజధాని అంశంపై సుప్రీంకోర్టు ఇటీవలే తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. మూడు రాజధానుల అంశం (పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలు) స్థానిక హైకోర్టులో తేల్చుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతుండడంతో జోక్యం చేసుకోలేమని చెప్పింది.




ఏపీ రాజధాని అంశంపై సుప్రీంకోర్టు ఇటీవలే తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. మూడు రాజధానుల అంశం (పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలు) స్థానిక హైకోర్టులో తేల్చుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతుండడంతో జోక్యం చేసుకోలేమని చెప్పింది.

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. సీఆర్డీఏ, పాలనా వికేంద్రీకరణ రద్దు చట్టాలపై ఏపీ హైకోర్టు విధించిన స్టేటస్ కోను సవాల్ చేస్తూ జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.




రెండోసారి అధికార వికేంద్రీకరణ బిల్లు ప్రభుత్వం అంటే మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. మండలి పక్కన పెట్టినా జూలై 17 నాటికి నెల పూర్తి అయితే ఆటోమేటిక్ గా అది ఆమోదం పొందినట్లేనన్నది నిపుణుల మాట.

దీంతో రాజధాని అంశంపై కేంద్ర పాత్ర ఉండదని అధికారికంగా చెప్పడంతో..ఓ క్లారిటీ వచ్చేసినట్లేనంటున్నారు. అమరావతిని రాజధానిగా చేస్తూ..గత ప్రభుత్వం కేంద్రానికి తెలియచేసిందనే సంగతి తెలిసిందే. కానీ..అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ప్రభుత్వం..మూడు రాజధానులను తెరపైకి తీసుకొచ్చింది.




ఏపీలో మూడు రాజధానుల అవసరం ఉందన్నారు. అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, కర్నూలులో హైకోర్టు, జ్యుడీషియల్ కేపిటల్ ఏర్పాటు చేయొచ్చన్నారు.

ఏపీలో మూడు రాజధానుల అవసరం ఉందన్నారు సీఎం జగన్. అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, కర్నూలులో హైకోర్టు, జ్యుడీషియల్ కేపిటల్ ఏర్పాటు చేయొచ్చన్నారు.



జీఎన్‌ రావు కమిటీ.. నాలుగు కమిషనరేట్లు, మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వానికి నివేదించింది. ప్రస్తుతం అమరావతిలో ఉన్న భవనాలను ప్రభుత్వం ఉపయోగించుకోవాలని చెప్పింది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని, రాష్ట్ర అభివృద్ధిపై ఏర్పాటైన జీఎన్‌ రావు కమిటీ.. నాలుగు కమిషనరేట్లు.. మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వానికి నివేదించింది. ప్రస్తుతం అమరావతిలో ఉన్న భవనాలను ప్రభుత్వం ఉపయోగించుకోవాలని చెప్పింది. భవిష్యత్‌లో నిర్మించే వాటిని మెట్ట ప్రాంతంలో ఏర్పాటు చేయాలని సూచించింది.



ఏపీలో నాలుగు ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేయాలని రాజధానిపై ఏర్పాటైన నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్ర అభివృద్ధి ఏవిధంగా ఉండాలి.. రాజధాని ఎలా ఉండాలనే అంశాలపై అధ్యయనం చేసిన కమిటీ.. తుది నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, కమిటీ కన్వీనర్‌ జీఎన్‌ రావు సీఎం జగన్‌కు 125 పేజీల నివేదికను సమర్పించారు.

రాజ్యాంగంలోని 197 అధికారణ, క్లాజ్ 2 ప్రకారం గవర్నర్ ఆమోదం కోసం సీఆర్డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులను గవర్నర్ కార్యాలయానికి ఏపీ ప్రభుత్వం పంపించిన సంగతి తెలిసిందే. కాగా ఈ బిల్లులను ఆమోదించవద్దని ప్రతిపక్ష టిడిపి, బిజెపిలు గవర్నర్ కు లేఖలు రాశారు.



మూడు రాజధానుల బిల్లుకు ఎట్టకేలకు ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోద ముద్ర వేశారు. ఇన్ని రోజులు పెండింగ్‌లో ఉంచిన బిల్లుపై న్యాయ సలహాలు తీసుకున్న తర్వాత రాజముద్ర వేశారు. దీంతో ఏపీలో పొలిటికల్‌ గేమ్‌ స్టార్ట్‌ అయ్యింది. గవర్నర్‌ మూడు రాజధానుల బిల్లును ఆమోదించడంపై టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి.