CEC : ఏపీకి కేంద్ర ఎన్నికల బృందం.. ఎలక్షన్ నిర్వహణ, ఓటర్ల జాబితా రూపకల్పనపై చర్చ

ఏపీ ఓటర్ల జాబితా తయారీలో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని టీడీపీ ఆరోపిస్తోంది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేసింది.

Central Election Commission

CEC Team Visit AP : ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటించనుంది. ఇందుకోసం నిన్ననే కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు విజయవాడకు వచ్చారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవో ముఖేశ్‌కుమార్‌ మీనా, జేసీ డాక్టర్‌ సంపత్‌కుమార్‌ ఇతర అధికారులు వారికి స్వాగతం పలికారు. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు ఎన్నికల సంఘం ప్రతినిధులు సమావేశాలు నిర్వహించనున్నారు. ఓటరు జాబితాలో అవకతవకలపై నివేదిక రూపొందించనున్నారు.

ఏపీ ఓటర్ల జాబితా తయారీలో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని టీడీపీ ఆరోపిస్తోంది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేసింది. నిన్న లోక్‌సభలో ఎన్నికల ప్రధాన కమిషనర్‌, ఇతర కమిషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లుపై జరిగిన చర్చలో ఎంపీ గల్లా జయదేవ్‌ పాల్గొన్నారు. ఏపీలో ఓటర్ల జాబితాలో భారీగా అధికారపార్టీ అవకతవకలకు పాల్పడుతోందని ఆరోపించారు.

Covid-19 : హైదరాబాద్‌లో 14 నెలల చిన్నారికి కరోనా పాజిటివ్… తెలంగాణలో మెల్లగా విస్తరిస్తున్న మహమ్మారి

జాబితాలో సవరణల కోసం ఇప్పటివరకు 23 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటన్నింటినీ పరీక్షించిన తర్వాతే తుది జాబితా వెలువరించాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని నిష్పాక్షికంగా చేపట్టేందుకు బయటి రాష్ట్రాల నుంచి పర్యవేక్షకులను పంపాలని ఆయన కేంద్ర న్యాయశాఖ మంత్రిని కోరారు.

ఏపీలో తప్పుల్లేని ఓటర్ల జాబితాను తయారు చేయడంలో డీఈఓలు, ఈఆర్‌ఓలు ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించడం లేదన్నారు ఎంపీ గల్లా జయదేవ్‌. అక్కడ అధికారులు ఒత్తిళ్ల మధ్య పనిచేస్తున్నారన్నారు. ఈ అవకతవకలకు అడ్డుకట్ట వేయాలని కోరారు.