Amit Shah: 2024 జూన్ 2 నుంచి కొత్త రాజధాని అమల్లోకి.. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టసవరణ బిల్లుపై అమిత్ షా కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా అమరావతి పేరును చేర్చాలని భారత ప్రభుత్వాన్ని ఏపీ కోరిందని, అమరావతిని రాజధానిగా చేర్చాలని ప్రతిపాదించారని తెలిపారు.

  • Published On : March 31, 2026 / 05:25 PM IST

 

Amit Shah: ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరణ ఇచ్చారు. ఏపీ, తెలంగాణకు హైదరాబాద్ పదేళ్ల పాటు రాజధానిగా కొనసాగిందన్నారు అమిత్ షా. ఏపీ ప్రభుత్వం అమరావతిని కొత్త రాజధానిగా ప్రకటించిందన్న అమిత్ షా.. అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధితో పాటు పరిపాలనకు సంబంధించిన చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

2026 మార్చి 28న ఏపీ అసెంబ్లీ అమరావతి రాజధాని తీర్మానం చేసిందని వివరించారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా అమరావతి పేరును చేర్చాలని భారత ప్రభుత్వాన్ని ఏపీ కోరిందని, అమరావతిని రాజధానిగా చేర్చాలని ప్రతిపాదించారని తెలిపారు. 2024 జూన్ 2 నుంచి అమల్లోకి కొత్త రాజధాని వస్తుందని తెలిపారు అమిత్ షా. కాగా, రేపు పార్లమెంటు ముందుకు ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు రాబోతోంది.

Also Read: అమరావతి చట్టబద్ధతపై వైసీపీ స్టాండ్ ఏంటి? పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చ ఏంటి?

ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష రేపు చట్టబద్ధం కానుందని తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక కేంద్రాన్ని ఒప్పించి మరీ రాజధానికి చట్టబద్ధత తీసుకురాబోతోంది. రాజధానికి కేంద్రం చట్టబద్ధత కల్పించడం గొప్ప పరిణామంగా భావించాల్సి ఉంటుంది. ఈ నెల 28న అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపించారు. కేంద్రం కూడా అన్నీ పరిశీలించిన మీద వెంటనే పార్లమెంటులో ఒక చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది.

ఏపీ ప్రజల కలలు సాకారం కాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లుని కేంద్రం రేపు లోక్ సభలో ప్రవేశపెట్టబోతోంది. ఆ వెంటనే రాజ్యసభలోనూ ప్రవేశపెట్టబోతోంది. దీనిపై చర్చ జరుగుతుంది. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదం కోసం బిల్లు వెళ్లబోతుంది. తర్వాత చట్టబద్ధతపై రాజ్యపత్రం విడుదల అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి రాజ్యపత్రం రిలీజ్ కానుంది.

Also Read: ప్రపంచ దేశాలకు భారీ ఊరట.. యుద్ధం ముగింపునకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్..