Gudur-Gummidipoondi Railway: ఏపీకి మరో భారీ రైల్వే ప్రాజెక్టు.. రూ. 2,229 కోట్ల వ్యయం.. కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం

గూడూరు-గుమ్మిడిపుండి(Gudur-Gummidipoondi Railway) సెక్షన్ మధ్య రూ. 2,229 కోట్ల వ్యయంతో మరో రెండు కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Centre approves gudur gummidipoondi railway line project for andhra pradesh

  • ఏపీకి కొత్త రైల్వే ప్రాజెక్టు
  • గూడూరు-గుమ్మిడిపుండి మధ్య రెండు లైన్లు
  • కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర

Gudur-Gummidipoondi Railway: తెలుగు రాష్ట్రాల్లో రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణ దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య రైల్ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసేందుకు గూడూరు-గుమ్మిడిపుండి సెక్షన్ మధ్య రూ. 2,229 కోట్ల వ్యయంతో మరో రెండు (3, 4వ) కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా, వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. వైజాగ్-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌తో పాటు ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్‌లో ఈ మార్గం అత్యంత కీలకమైనదిగా మారనుంది.

Also ReadSupreme Court: వాహనదారులకు బిగ్ షాక్.. ఇన్సూరెన్స్ లేకపోతే పెట్రోల్ బంద్.. సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

రూ. 2,229 కోట్లతో 90 కిలోమీటర్ల మేర లైన్ల విస్తరణ:

గూడూరు నుంచి గుమ్మిడిపుండి (Gudur-Gummidipoondi Railway)మధ్య 90 కిలోమీటర్ల పొడవునా సాగే ఈ ప్రాజెక్టును రాబోయే నాలుగేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నిర్మాణంలో భాగంగా స్వర్ణముఖి నదిపై ఒక భారీ బ్రిడ్జి, 21 పెద్ద వంతెనలు, 127 చిన్న వంతెనలతో పాటు 34 ఆర్వోబీ లేదా ఆర్‌యూబీలను నిర్మించనున్నారు. ఈ కొత్త లైన్ల వల్ల పులికాట్ సరస్సు, నేలపట్టు పక్షుల అభయారణ్యం వంటి పర్యాటక ప్రాంతాలకు రవాణా సౌకర్యం మరింత సులువవుతుంది.

రైల్వే నెట్‌వర్క్ విస్తరణ, కోట్లాది మందికి ప్రయోజనం:

ఈ ప్రాజెక్టుతో పాటు దేశవ్యాప్తంగా మొత్తం రూ. 9,450 కోట్ల అంచనా వ్యయంతో 4 మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనివల్ల భారతీయ రైల్వే నెట్‌వర్క్ మరో 410 కిలోమీటర్ల మేర విస్తరించనుంది. దాదాపు 6,448 గ్రామాలకు చెందిన 60 లక్షల మంది జనాభాకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది. 2030-31 నాటికి ఈ విస్తరణ లక్ష్యాలను పూర్తిగా సాధిస్తామని కేంద్రం స్పష్టం చేసింది.