శాసనసభా పంపిన రెండు బిల్లులను (రాజధాని వికేంద్రీకరణ, CRDA రద్దు) ఆమోదించాలి ? లేదా ? సవరణలతో తిరిగి పంపాలని ఏపీ మంత్రి బుగ్గన వివరించారు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపేందుకు రూల్ ఎక్కడుందని ప్రశ్నించారు. బిల్లులను ప్రవేశ పెట్టే సమయంలో ప్రతిపక్ష నేత గ్యాలరీలో సుమారు 4గంటల పాటు కూర్చొన్నారని ఎందుకు అక్కడున్నారు ? బాబు ప్రభావితం చూపలేదా సూటిగా ప్రశ్నించారు.
2020, జనవరి 23వ తేదీ గురువారం ఏపీ శాసనసభా సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనమండలిలో జరిగిన పరిణామాలపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. సమావేశానికి టీడీపీ దూరంగా ఉంది. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను మండలి ఛైర్మన్ సెలెక్ట్ కమిటీకి పంపించిన సంగతి తెలిసిందే. దీనిని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించింది. శాసనసభలో జరిగిన చర్చలో మంత్రి బుగ్గన మాట్లాడుతూ..
ఛైర్మన్‌కు ఎదురుగా బాబు కూర్చొన్నారని తెలిపారు. బిల్లులను ప్రవేశపెట్టిన సమయంలో సవరణలు ప్రవేశపెట్టాలని, సవరణలు, తీర్మానాల విషయంలోనే విచక్షణా అధికారం ఉంటుందని సభకు తెలిపారు. రూల్ 71పై చర్చకు ఛైర్మన్ అనుమతించి..ఆ తర్వాత..సెలెక్ట్ కమిటీకి పంపించడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని టీడీపీ లేఖలు పంపారంట, దీనిపై రూల్స్ చాలా స్పష్టంగా ఉన్నాయనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
సెలెక్ట్ కమిటీ అంశంలో విచక్షణా అధికారం అనేది ఎక్కడా లేదని స్పష్టంగా చెప్పారు. సంఖ్యా బలం ఉందని కదా..అని ఇష్టం వచ్చినట్లు చేసి ఛైర్మన్‌పై ప్రభావం చూపించారని విమర్శించారు. ప్రత్యేక పరిస్థితుల్లో రూల్ 71ని వాడాలని, మండలి అభిప్రాయం చెప్పడానికే రూల్ 71 అని అన్నారు. రూల్ 154లో సెలెక్ట్ కమిటీకి ఎక్కడా పంపించలేదని చెప్పలేదన్నారు.
Read More : ఛైర్మన్ చేసింది అనైతికం : ప్రజలు ఆశీర్వదిస్తే..మరో 50 ఏళ్లు మేమే – బొత్స