Chaitanya Group Chairman BS Rao Allegations Against Lingamaneni Ramesh
Lingamaneni Ramesh: రియల్టర్ లింగమనెని రమేష్ తమను మోసం చేశారని చైతన్య గ్రూప్ అఫ్ కాలేజీస్ చైర్మెన్ బియస్ రావు సంచలన ఆరోపణలు చేశారు. తమ కాలేజీలను విస్తరించేందుకు లింగామనేని రమేష్ భూములు, భవనాలు ఇస్తామని చెప్పి తమతో పెట్టుబడి పేరుతో డిపాజిట్లు సేకరించారని ఆయన ఆరోపించారు. లింగామనెని రమేష్‌ను నమ్మి 2012-13 లో చెక్కుల రూపంలో 310 కోట్ల రూపాయల వరకు ఇచ్చామని ఆయన అన్నారు. ఈ విషయమై 2016లో ఎంఓయూ రాసి భూములు ఇప్పిస్తా అని హామీ ఇచ్చి మోసం చేశారని అన్నారు. ఈ ఒప్పందం కొంత మంది పెద్దల సమక్షంలో జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. లింగమనేని రమేష్ ఛీటింగ్ మీద హైదరాబాద్ సీసీఎస్‌లో ఆరు కేసులు నమోదయ్యాయని బీఎస్ రావు తెలిపారు. నెలవారీగా తమకు వడ్డీతో సహా చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా చెల్లించడం లేదని ఆయన ఆరోపించారు. గతంలో ఆయన ఇచ్చిన చెక్కులు బ్యాంకులో వేయగానే చెల్లలేని వెల్లడించారు.
Air India: ఎయిర్ బస్‌తో ఎయిర్ ఇండియా భారీ డీల్.. 250 విమానాలు కొనేందుకు ఒప్పందం