chalasani srinivas daughter : ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన కుమార్తె శిరిష్మ (27) ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో తెలియరాలేదు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓయూ కాలనీలోని ట్రయల్ విల్లాస్ లో నివాసించే గ్రానైట్ వ్యాపారి సిద్దార్థ్ తో 2016 డిసెంబర్ లో వివాహమైంది. శిరిష్మ ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తున్నారు.
గచ్చిబౌలిలోని ఐకియా స్టోర్ సమీపంలోని ప్లాట్ 906 – డిలో వీరిద్దరూ నివాసం ఉంటున్నారు. వివాహమై నాలుగు సంవత్సరాలు దాటినా..వీరికి సంతానం కలగలేదు. దీంతో శిరిష్మ తీవ్ర డిప్రెషన్ కు లోనయ్యారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో సిద్దార్థ్ ఇంటికి వచ్చారు. ఇంట్లో ఫ్యాన్ కు శిరిష్మ ఉరి వేసుకుని కనిపించింది. దీంతో ఆమెను కిందకు దించి…చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు ధృవీకరించారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి చలసాని శ్రీనివాస్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు పోలీసులు.