Chandra Babu Naidu: ప్రచార ఆర్భాటం తప్ప ప్రభుత్వం చేసిందేమీ లేదు: చంద్రబాబు

వైసీపీ ప్రభుత్వం నాడు-నేడు అంటూ ప్రచారం చేసుకోవడం తప్ప.. ప్రభుత్వ పాఠశాలల పునరుద్ధరణ కోసం చేసిందేమీ లేదని విమర్శించారు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు.

Chandrababu Naidu

Chandra Babu Naidu: వైసీపీ ప్రభుత్వం నాడు-నేడు అంటూ ప్రచారం చేసుకోవడం తప్ప.. ప్రభుత్వ పాఠశాలల పునరుద్ధరణ కోసం చేసిందేమీ లేదని విమర్శించారు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల ప్రాథమికోన్నత పాఠశాలలో పైకప్పు పెచ్చులు రాలి చిన్నారుల తలలకు తీవ్ర గాయాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటన బాధకరమని వ్యాఖ్యానించారు చంద్రబాబు. గురువారం అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ పాఠశాలలో పైకప్పు సరిగ్గా లేదని, విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

Andhra Pradesh: పొదుపు పథకంతో మహిళల అభివృద్ది: మల్లాది విష్ణు

‘‘ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్ధత వల్ల చదువుకోవడానికి వచ్చిన చిన్నారులు రక్తం చిందించాల్సి వచ్చింది. ఇది ప్రభుత్వానికి సిగ్గుచేటు. ప్రభుత్వం ఇకనైనా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెట్టాలి. బాధిత చిన్నారుల కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలి. ఒక ఫుల్ పేజీ పేపర్ యాడ్ కోసం ఖర్చు పెట్టే డబ్బులతో ఎన్ని పాఠశాలలు బాగు చేయొచ్చో తెలుసుకోవాలి’’ అని చంద్రబాబు అన్నారు.