సంక్రాంతి సంబరాలకు బాబు దూరం..నారావారిపల్లె పర్యటన రద్దు

  • Publish Date - January 5, 2020 / 06:16 AM IST

సంక్రాంతి..పండుగ వచ్చేస్తోంది. బ్యాగులతో స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమౌతున్నారు. కొంతమంది ఇప్పటికే చేరుకున్నారు. ఏపీ రాష్ట్రంలో ఈ పండుగ సంబరాలు అంబరాన్ని అంటుతాయి. కోళ్ల పందాలు, ముగ్గుల పోటీలు, పిండివంటకాలు, రైతుల ఆనందం మధ్య సంబరాలు జరుగుతుంటాయి. సంక్రాంతి పండుగను కుటుంబసభ్యుల మధ్య ఘనంగా నిర్వహించుకొనే టీడీపీ అధ్యక్షుడు బాబు ఓ నిర్ణయం తీసుకున్నారు.

సంబరాలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. పండుగకు ఎప్పుడూ వెళ్లే నారావారిపల్లెకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకుంది బాబు కుటుంబం. దీనికి కారణం ఉంది. రాజధాని విషయంలో ప్రభుత్వ వైఖరి, అమరావతి రైతుల ఆందోళన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు బాబు. ఈ పండుగకు బాబు కుటుంబం హైదరాబాద్‌లోనే ఉండనుంది. 

బాబు సొంతూరు చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లె. సంక్రాంతి పండుగకు కుటుంబసభ్యులతో ఇక్కడకు చేరుకుని సంబరాలు జరుపుకుంటుడడం ఆనవాయితీగా వస్తోంది. గ్రామ దేవత సత్యమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. నాగప్రతిమకు పూజలు నిర్వహిస్తుంటారు. నారావారిపల్లెలో నందమూరి, నారా కుటుంబాలు సందడి చేస్తుంటాయి. తల్లిదండ్రులు ఖర్జూర నాయుడు, అమ్మణ్ణమ్మ సమాధుల వద్ద నివాళులర్పిస్తారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, తోటి స్నేహితులతో బాబు ముచ్చటించనున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటుంటారు. కానీ ఈ సంక్రాంతి పండుగకు మాత్రం బాబు నారావారిపల్లెకు రావడం లేదు. 

Read More : 

చార్మినార్ వద్ద జాతీయ జెండాను ఎగురవేయనున్న ఓవైసీ