×
Ad

KA Paul : చంద్రబాబు, జగన్ కేంద్రానికి తొత్తులు.. బీజేపీ వలన దేశం సర్వనాశనం అయింది : కేఏ పాల్

చంద్రబాబు వందకు వందశాతం అవినీతి చేశాడని ఆరోపించారు. చంద్రబాబును గాంధీ, అంబేద్కర్ తో పోల్చడం దారుణం అన్నారు.

  • Published On : September 12, 2023 / 01:42 PM IST

KA Paul

KA Paul – Chandrababu : చంద్రబాబు, జగన్, బీజేపీపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి తొత్తులు అని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ అయితే డాన్స్ లు వేస్తున్నాడు. బీజేపీ వలన దేశం సర్వనాశనం అయిందని విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు వందకు వందశాతం అవినీతి చేశాడని ఆరోపించారు. చంద్రబాబును గాంధీ, అంబేద్కర్ తో పోల్చడం దారుణం అన్నారు. ఆరు వందల మంది టీడీపీ కార్యకర్తలు రోడ్ల మీదకి రాలేదని చెప్పారు. చంద్రబాబు తన శిష్యుడని ఆయన గురించి తనకు బాగా తెలుసు అన్నారు. చంద్రబాబును ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారో ప్రజలకు తెలుసన్నారు.

High Court : చంద్రబాబు అక్రమ అరెస్టును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్

జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోదీ, అమిత్ షాను కలవనున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని వెల్లడించారు. జూనీయర్ ఎన్టీఆర్ తెలివైనవాడని ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారని పేర్కొన్నారు.