High Court : చంద్రబాబు అక్రమ అరెస్టును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్

స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటులో స్కాం జరిగిందని దాంట్లో చంద్రబాబు సూత్రధారి అనే ఆరోపణలతో సీబీఐ అధికారులు ఆయన్ను అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు.

High Court : చంద్రబాబు అక్రమ అరెస్టును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్

AP High Court (2)

Updated On : September 12, 2023 / 11:56 AM IST

AP High Court Petition : టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఆయన తరపు లాయర్లు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు అక్రమ అరెస్టు, గవర్నర్ కి సమాచారం లేకుండా అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ చంద్రబాబు తరపు లాయర్లు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం విచారణ జరిగే అవకాశం ఉంది. మరోవైపు చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టు మంగళవారం తీర్పు చెప్పనుంది.

చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ఆయన్ను అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటులో స్కాం జరిగిందని దాంట్లో చంద్రబాబు సూత్రధారి అనే ఆరోపణలతో సీబీఐ అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు. అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా చంద్రబాబుకు సెప్టెంబర్ 22 రిమాండ్ విధించింది.

Yarapathineni Srinivasa Rao : చంద్రబాబును అరెస్ట్ చేసి జగన్ దిద్దుకోలేని తప్పు చేశారు : యరపతినేని శ్రీనివాస్

దీంతో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. జైలులో స్నేహ బ్లాక్ మొత్తాన్ని చంద్రబాబుకు కేటాయించారు. బ్లాక్ లో ఆయనకు ఒక ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. జైలులో చంద్రబాబుకు సహాయకుడిగా ఓ ఖైదీని ఏర్పాటు చేశారు. చంద్రబాబుకు ఇంటి భోజనాన్ని కోర్టు అనుమతించింది.