High Court : చంద్రబాబు, లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ

ఇదిలా ఉంటే అంగళ్ళ అల్లర్లు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇప్పటికే వాదనలు పూర్తి అయ్యాయి. ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

AP High Court (3)

Chandrababu and Lokesh – High Court : టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ లు ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. వారు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరుగనుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం కేసులో విజయవాడ ఏసీబీ కోర్టులో నారా లోకేష్ ను ఏ-14గా చేరుస్తూ సీఐడీ అధికారులు మెమో ఇచ్చారు. ఇన్నర్ రింగ్ కేసుకు లోకేష్ కు ఎలాంటి సంబంధం లేదంటూ ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఉదయం ఫస్ట్ అవర్ లో లోకేష్ ముందస్తు బెయిల్ పై హైకోర్టులో విచారణ జరుగనుంది.

మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలెన్ మెంట్ కేసులో చంద్రబాబు ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై మధ్యాహ్నం 2:15 గంటలకు నిమిషాలకు ఏపీ హైకోర్టులో విచారణ జరుగనుంది. ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇరువర్గాల న్యాయవాదులు వాదనలు వినిపించారు.

Also Read: చంద్రబాబు కేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం కేవియట్ పిటిషన్, ఎందుకీ పిటిషన్?

ఇదిలా ఉంటే అంగళ్ళ అల్లర్లు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇప్పటికే వాదనలు పూర్తి అయ్యాయి. ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అంగళ్ళ అల్లర్ల కేసులో చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తుందా? లేక హైకోర్టు బెయిల్ తిరస్కరిస్తుందా? అని చంద్రబాబు, సీఐడీ తరఫున న్యాయవాదులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కాాగా, చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఏసీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబును పోలీసులు అరెస్టు చేసి విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరు పర్చగా రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. చంద్రబాబుకు జైలులో స్నేహ బ్లాక్ ను కేటాయించారు. అలాగే ఆయనకు స్వంత గదిని కేటాయించారు. ఇంటి భోజనానికి అధికారులు అనుమతించారు.

ట్రెండింగ్ వార్తలు