Balakrishna : చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కుట్ర, న్యాయపోరాటం చేస్తాం- బాలకృష్ణ

మతిస్థిమితం లేని వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసుకోవడం ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. Balakrishna - Chandrababu Arrest

Balakrishna - Chandrababu Arrest

Balakrishna – Chandrababu Arrest : చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కుట్రలో భాగమే అన్నారు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో వాస్తవాలు లేవన్నారు. ప్రజలను డైవర్ట్ చేసేందుకే ప్రభుత్వం ఇలా చేసిందన్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా చట్టాన్ని అతిక్రమించి వైసీపీ ప్రభుత్వం చేసిన రాజకీయ కుట్ర ఇది అని బాలకృష్ణ ఆరోపించారు. చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపునకు నిదర్శనం అన్నారాయన. రాజమండ్రి సెంట్రల్ జైల్లో పవన్ కల్యాణ్, నారా లోకేశ్, బాలకృష్ణలు.. చంద్రబాబుని కలిశారు. చంద్రబాబుతో భేటీ తర్వాత బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా నిప్పులు చెరిగారు బాలయ్య.

”చంద్రబాబు జైల్లో చాలా ధైర్యంగా ఉన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసమే అయన బాధపడుతున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కలిసి ముందుకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాం. ఇక నుండి వైసీపీపై యుద్ధం చేస్తాం. మతిస్థిమితం లేని వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసుకోవడం ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. యావత్ రాష్ట్రమే కాదు దేశం మొత్తం చంద్రబాబుకి మద్దతు తెలుపుతున్నారు. మానసికంగా యువతను ముందుకు తీసుకువెళ్లేందు ప్రణాళిక తో ముందుకు వెళ్తే ఈనాడు గంజాయికి అలవాటు చేశాడు ఈ సైకో ముఖ్యమంత్రి.

Also Read..Pawan Kalyan: జైల్లో చంద్రబాబు భద్రత విషయంపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

ఆ ఫైల్ ను అమలు చేసింది అజయ్ కల్లాం. ఈ రోజు ఆయన ఎక్కడ ఉన్నాడు? దాన్ని ఎంఓయూ చేసింది ప్రేమచంద్రా రెడ్డి. ఆయనిప్పుడు మీ దగ్గర మంచి పదవుల్లోనే ఉన్నాడుగా. స్కిల్ సెంటర్ లో ఆరు క్లస్టర్లలో 42సెంటర్లు ఓపెన్ చేసి 2లక్షలు మందికి ఉపాధి కల్పిస్తే, పాలసీ మేకర్ ను ఈనాడు జైలుకు పంపారు. ఈ అరెస్ట్ కి భయపడే వాళ్ళం కాదు. న్యాయపరంగా పోరాటం చేస్తాం. కామ్రేడ్ సీబీన్ అంటూ చంద్రబాబుకి మద్దతుగా హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు భారీ ధర్నా నిర్వహించారు. అదీ చంద్రబాబు ఘనత” అని బాలకృష్ణ అన్నారు.

Also Read..TDP Janasena Alliance: పూర్తిగా ఓపెన్ అయిన పవన్ కళ్యాణ్.. తర్వాత ఏం జరగబోతోంది?

మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పొత్తులపై ఓపెన్ అయిపోయారు. ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని పవన్ కల్యాణ్ ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఢీకొట్టాలంటే టీడీపీతో చేతులు కలపాల్సిందే అన్నారు. బీజేపీ కూడా తమతో కలిసి రావాలని జనసేనాని కోరారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుని గురువారం(సెప్టెంబర్ 14) మధ్యాహ్నం పవన్ కలిశారు. నందమూరి బాలకష్ణ, (Nandamuri Balakrishna) నారా లోకేశ్ తో (Nara Lokesh) కలిసి.. చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. పొత్తులపై స్పష్టం ఇచ్చారు పవన్ కల్యాణ్. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసే వెళ్తాయని తేల్చి చెప్పారు.

”వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కలిసి వెళ్తాయి. చంద్రబాబుతో ములాఖత్ రాష్ట్రానికి చాలా కీలకమైనది. నేను ఎన్డీయేలో ఉన్నాను. 2024లో ఈ అరాచక పాలన నుంచి బయటపడాలంటే బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి వెళ్లాలని నా కోరిక. బీజేపీ దీనిపై పాజిటివ్ నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నారు. ఈ అడ్డగోలు దోపిడీని ఎదుర్కోవాలంటే విడివిడిగా పోటీ చేస్తే పని చేయదు” అని పవన్ కల్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు.

టీడీపీతో పొత్తుపై పవన్ కల్యాణ్ కుండబద్దలు కొట్టడంతో ఏపీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. టీడీపీ, జనసేన నాయకులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుండగా.. అధికార వైసీపీ నాయకులు మాత్రం విమర్శలు చేస్తున్నారు. ప్యాకేజ్ బంధం బయటపడిందని.. పవన్ కళ్యాణ్ పై భ్రమలు తొలగిపోయాయని మాటల యుద్ధానికి దిగారు. టీడీపీ జనసేన పొత్తుపై స్పష్టత రావడంతో తర్వాత అడుగు ఎలా ఉండబోతుందన్న చర్చ సర్వత్రా మొదలైంది.