Kesineni Nani: ఎన్నికల వేళ కేశినేని నానికి టీడీపీ హైకమాండ్‌ షాక్

కేశినేని నాని, ఆయన తమ్ముడు నాని వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

Kesineni Nani

లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై ఎంపీ కేశినేని నానికి టీడీపీ అధిష్ఠానం స్పష్టతనిచ్చింది. విజయవాడ ఎంపీ టిక్కెట్‌ను వేరే వారికి కేటాయిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ తన ఫేస్ బుక్ ఖాతాలో కేశినేని నాని పోస్ట్ చేశారు.

‘అందరికీ నమస్కారం.. నిన్న సాయంత్రం చంద్రబాబు ఆదేశాల మేరకు మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజా, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు నెట్టం రఘురాం, మాజీ ఎంపీ కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు కొనకళ్ల నారాయణ నన్ను కలసి 7 వ తేదీన తిరువూరు పట్టణంలో జరిగే సభకు వేరే వారిని ఇన్‌చార్జ్ గా చంద్రబాబు నియమించారని కాబట్టి ఆ విషయంలో నన్ను కలగ చేసుకోవద్దని చంద్రబాబు నాకు చెప్పమన్నారని తెలియచేశారు.

అట్లాగే రాబోయే ఎన్నికలో నా స్థానంలో విజయవాడ లోకసభ అభ్యర్థిగా వేరేవారికి అవకాశం ఇవాలనుకుంటున్నారని కాబట్టి ఎక్కువగా పార్టీ వ్యవహారంలో నన్ను జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు ఆదేశించారని నాకు తెలియచేశారు. అధినేత ఆజ్ఞలను తూచా తప్పకుండా శిరసావహిస్తానని వారికి నేను హామీ ఇచ్చాను’ అని చెప్పారు.

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఘటన తర్వాత కేశినేని నాని టీడీపీ క్లారిటీ ఇవ్వడం గమనార్హం. కేశినేని నాని, ఆయన తమ్ముడు నాని వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. తిరువూరులోని టీడీపీ కార్యాలయం వద్ద రెండు వర్గాల వారు పరస్పరం దాడి చేసుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు