Ambati Rambabu : చంద్రబాబు అనేక హత్యలు, అవినీతికి పాల్పడ్డాడు.. మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు

ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు జైలులో ఉండగా జరగుతున్న అసెంబ్లీ సమావేశాలు అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో అసెంబ్లీలో ప్రవర్తించాలని టీడీపీ శాసనసభ్యులకు మనవి‌ చేస్తున్నానని తెలిపారు.

Ambati Rambabu Criticism Chandrababu

Ambati Rambabu – Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పత్రికలు, ధన బలంతో చంద్రబాబు ఎదిగాడని అనేక హత్యలకు, అవినీతికి పాల్పడ్డాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో చంద్రబాబు అనేక నేరాలు, ఘోరాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎక్కడ దొరకననే ఉద్దేశంతో అన్ని చోట్ల అనేక అక్రమాలకు తెరతీశాడని పేర్కొన్నారు.

గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి అంబటి మాట్లాడారు. ఎమ్మెల్సీకి డబ్బులు ఇస్తూ దొరికిపోయాడని పేర్కొన్నారు. చట్టం ఆయనని ఏమీ చేయలేదనుకున్న తరుణంలో అరెస్ట్ అయ్యారని తెలిపారు. కక్ష సాదింపు కాదు..న్యాయస్థానం తన పని చేసుకుపోతుందన్నారు. అసలు నేరం జరగలేదని ఆయన లాయర్లు వాదించడం లేదని చెప్పారు.

AP Assembly Session: ఏపీ అసెంబ్లీలో గందరగోళం.. చంద్రబాబు అరెస్ట్ పై చర్చకు టీడీపీ పట్టు.. బాలకృష్ణకు అంబటి సవాల్

కాంగ్రెస్ లో ఉన్నప్పుడు చంద్రబాబు పార్టీలో అంకితభావంతో పని చేస్తానని చెప్పాడు ఆయన మామ ఎన్టీఆర్ పై పోటీ చేస్తానని చెప్పాడని గుర్తు చేశారు. తరువాత టీడీపీ అదికారంలోకి రాగానే కాంగ్రెస్ కి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. టీడీపీ పార్టికి పని చేసిన నాయకులను వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. చంద్రబాబు తన మామ ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి ఆయన చావుకు కారణం అయ్యారని ఆరోపించారు.

ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు జైలులో ఉండగా జరగుతున్న అసెంబ్లీ సమావేశాలు అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో అసెంబ్లీలో ప్రవర్తించాలని టీడీపీ శాసనసభ్యులకు మనవి‌ చేస్తున్నానని తెలిపారు. వాస్తవాలు ఒప్పుకోవాలని.. ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. లోకేష్ సర్వే పేరుతో ఢిల్లీలో గడుపుతున్నాడని వెల్లడించారు. చంద్రబాబు అరెస్ట్ పై వాయిదా తీర్మానం అడిగారని, దానిపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.