అహంకారంతో ఉంటే ఏమవుతుందో తెలంగాణలో చూశాం.. ఏపీలో కూడా అదే చూస్తాం: చంద్రబాబు

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. అహంకారంతో ప్రవర్తిస్తే ఏం జరుగుతుందో తెలంగాణలో చూశాం..మరో మూడు నెలల్లో ఏపీలో కూడా చూస్తాం అంటూ వ్యాఖ్యానించారు.

Chandrababu Reaction On Telangana Elections : తెలంగాణ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పరోక్షంగా స్పందించారు. శుక్రవారం మిగ్ జాగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సందర్భంగా ఆయన జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ”ఏపీలో అహంకార ప్రభుత్వం నడుస్తోందని.. అహంకారంతో ప్రవర్తిస్తే ఏం జరుగుతుందో తెలంగాణలో చూశాం. మరో మూడు నెలల్లో ఏపీలో కూడా చూస్తాం అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎన్నికల్లో జరిగిన పరిణామాలు ఆంధ్రప్రదేశ్ లో మరో మూడు నెలల్లో రిపీట్ అవుతాయని” అన్నారు.

40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న తాను ఎక్కడా ఒక్క తప్పు కూడా చేయలేదని అంతా చట్టప్రకారమే పనిచేశానని, అటువంటి తనను ఏ తప్పు చేయకపోయినా అరెస్ట్ చేశారని విమర్శించారు. చేయని తప్పుకు తాను ఎంతో క్షోభ అనుభవించానని వాపోయారు. తాను కూడా మనిషినేనని.. తనకు కూడా మనస్సు ఉంటుందని కానీ చేయని తప్పుకు తాను ఇబ్బందులుకు గురయ్యాయనని జైల్లో ఉన్న ఘటనలను గుర్తు చేసుకున్నారు.

తప్పు జరిగితే ప్రశ్నించే హక్కు ప్రతీ ఒక్కరికి ఉంటుందని, అది ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు అని అన్నారు. ఓటు వేసి గెలిపించిన ప్రభుత్వం అన్యాయం చేస్తే ప్రశ్నించటం తప్పుకాదన్నారు. అలా ప్రశ్నించినందుకు తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని, ఇంత అహంకారంతో వ్యవహరిస్తే తెలంగాణలో జరిగిందే ఏపీలో రిపీట్ అవుతుందని అన్నారు.

మిగ్ జాగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో  చంద్రబాబు  రెండు రోజులపాటు పర్యటించనున్నారు. దీంట్లో భాగంగా ఈరోజు గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పర్యటిస్తున్నారు. తుఫాను వల్ల పంట నష్ట పోయిన రైతులను పరామర్శించి వారికి దైర్యం చెబుతున్నారు. తెనాలి, వేమూరు, బాపట్ల నియోజక వర్గాల్లో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి రైతులను కలిసి పరామర్శిస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గo రేవేంద్రపాడు రైతుల్ని పరామర్శించారు. రైతుల కష్టాల గురించి తెలుసుకున్నారు. ప్రజలకు కష్టాలు ఇక మూడు నెలలే ఉంటాయని.. అందరూ ధైర్యంగా ఉండాలని సూచించారు.

Also Read: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల

ట్రెండింగ్ వార్తలు