AP Fishermen : మత్స్యకారులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. చేపల వేట నిషేధ సమయంలో వారికిచ్చే 10వేల రూపాయల సాయాన్ని 20వేలకు పెంచింది. అంతేకాదు మత్స్యకారులకు 20వేలు ఇచ్చిది ఎప్పుడో కూడా చెప్పేసింది. మత్స్యకారులకు ఇచ్చే సాయంపై మంత్రి నిమ్మల రామానాయుడు కీలక ప్రకటన చేశారు.
Also Read : నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. 2260 టీచర్ పోస్టులకు ఆమోదం..
ఈ నెలలోనే వారికి సాయం అందిస్తామని చెప్పారు. ఈ నెల 26న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా లబ్ధిదారులకు ఈ సాయం అందిస్తామన్నారు. ఓ మత్స్యకార గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తారని వెల్లడించారు. త్వరలోనే షెడ్యూల్ ఖరారు చేస్తామని మంత్రి నిమ్మల తెలిపారు.
వేట నిషేధ సమయంలో మత్స్యకారులకిచ్చే 10వేల రూపాయల సాయాన్ని 20వేలకు పెంచి ఇస్తామని ఎన్నికల సమయంలో కూటమి హామీ ఇచ్చింది. చెప్పినట్లుగానే మత్స్యకారులకు 20వేలు ఇస్తాం. ఏప్రిల్ నెలలోనే 26వ తేదీన ఒక మత్స్యకార గ్రామాన్ని సందర్శించి సీఎం చంద్రబాబు 20వేలకు పెంచిన సాయాన్ని లబ్దిదారులకు అందించనున్నారు.
మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here