Thalli-Bidda Express Services: ఏపీలో మాతా-శిశు రక్షణ కోసం బిగ్ స్టెప్.. ‘తల్లీ-బిడ్డ ఎక్స్‌ప్రెస్’ రీ-లాంచ్.. త్వరలోనే సేవలు ప్రారంభం
గర్భిణులు, శిశువులకు సురక్షితమైన ఉచిత రవాణా సేవలు అందించేందుకు సిద్ధం చేసిన ‘తల్లీ – బిడ్డ ఎక్స్‌ప్రెస్(Thalli-Bidda Express Services)’ వాహనాలను చంద్రబాబు పరిశీలించారు.
- V Santhosh Kumar
- Published on- July 20, 2026 / 03:21 PM IST
Chandrababu inspects Thalli-Bidda Express services set to launch soon in AP.
- తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ సిద్ధం
- 500 కొత్త ఏసీ వాహనాలు
- బాలింతలకు ఉచిత రవాణా సేవలు
Thalli-Bidda Express Services: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాతా–శిశు సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ మరో కీలక అడుగు వేసింది. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు సురక్షితమైన, నాణ్యమైన ఉచిత రవాణా సేవలు అందించేందుకు సిద్ధం చేసిన ‘తల్లీ – బిడ్డ ఎక్స్‌ప్రెస్(Thalli-Bidda Express Services)’ నూతన వాహనాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎం క్యాంపు కార్యాలయంలో పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే 500 ప్రత్యేక వాహనాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
Dengue Vaccine: ‘డెంగీ’కి వ్యాక్సిన్ వచ్చేసింది.. రెండు డోసులతో పూర్తి రక్షణ.. భారత ప్రభుత్వం ఆమోదం
వాహనాల సౌకర్యాలు, లక్ష్యాలు:
ఈ పథకం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన బాలింతలను, వారి శిశువులను పూర్తి ఉచితంగా ఇళ్లకు చేరుస్తారు. అలాగే అధిక ప్రమాదకర గర్భిణులు, రక్తహీనతతో బాధపడే మహిళలను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రులకు తీసుకురావడానికి కూడా వీటిని ఉపయోగిస్తారు. ప్రతి ఏటా సుమారు 2.75 లక్షల మంది బాలింతలకు లబ్ధి చేకూర్చేలా ఈ 500 SUV/MUV వాహనాలను రూపకల్పన చేశారు. వాహనాల్లో ఏసీ, ఫుట్‌రెస్ట్, జీపీఎస్ ట్రాకింగ్, ప్రథమ చికిత్స కిట్ వంటి భద్రతా సౌకర్యాలు కల్పించారు.
త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా సేవలు ప్రారంభం:
ఈ సందర్భంగా వాహనాల బ్రాండింగ్, రూపకల్పనను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు దానికి ఆమోదం తెలిపారు. అధికారిక స్టిక్కరింగ్ ప్రక్రియ పూర్తయిన వెంటనే అన్ని జిల్లాల్లో ఈ సేవలను అధికారికంగా ప్రారంభించనున్నారు. ప్రభుత్వ సేవలపై స్పష్టత వచ్చేలా బ్రాండింగ్ రూపొందించాలని, వాహనాల నిర్వహణ నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
