chandrababu-Rajasekhara Reddy :  : అసెంబ్లీలో నేను లేచి నిలబడితే..రాజశేఖర్ రెడ్డి కూర్చునేవారు

 అసెంబ్లీలో నేను లేచి నిలబడితే... రాజశేఖర్ రెడ్డి కూర్చునేవారని.. అది రాజశేఖర్ రెడ్డి సంస్కారం అని కానీ ఆయన కొడుకైన జగన్ కు అటువంటి సభ్యతే కాదు కనీస సంస్కారం కూడా లేని వ్యక్తి అంటూ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

chandrababu vs rajasekhara reddy :  అసెంబ్లీలో నేను లేచి నిలబడితే… రాజశేఖర్ రెడ్డి మాట్లాడేవారుకూడా మనేసి కూర్చునేవారని.. అది రాజశేఖర్ రెడ్డి సంస్కారం అని కానీ ఆయన కొడుకైన జగన్ కు అటువంటి సభ్యతే కాదు కనీస సంస్కారం కూడా లేని వ్యక్తి అంటూ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. నేను అసెంబ్లీలో నిలబడి మాట్లాడుతుంటే వైసీపీ నేతలు..జగన్ బూతులు తిట్టారని అందుకే అది గౌరవ సభ కాదు కౌరవ సభగా భావించి సభ నుంచి బయటకు వచ్చేశారని..తిరిగి అసెంబ్లీ సభని గౌరవ సభను చేసిన అసెంబ్లీలో అడుగుపెడతానని బయటకు వచ్చేశానని తెలిపారు.

కుప్పంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. తాను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉండి కూడా లేచి నిలబడే వారని అది ఆయన సభ్యత సంస్కారం అని అన్నారు. రాజకీయంగా ఎన్నో విభేధాలు ఉన్నా ఎంతోమంది రాజకీయ నాయకులు తనను గౌరవించేవారని తాను కూడా వారిని గౌరవించేవాడినని చెప్పుకొచ్చారు.

కానీ నేడు ఏపీలో అటువంటి పరిస్థితి లేదని..వైసీపీ నేతలు సంస్కారహీనులనీ..సీఎంగా ఉండి కూడా ఓ సైకోలా వ్యవహరించే వ్యక్తి పాలనలో అటువంటివారే ఉంటారంటూ జగన్ పైనా..వైసీపీ నేతలపైనా విరుచుకుపడ్డారు చంద్రబాబు. సైకో సీఎం పార్టీ నేలందనికి సైకోల్లా తయారు చేస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికార మధంతో వ్యవహరించేవారికి ప్రజలు బుద్ధి చెప్పాలని సైకో ప్రభుత్వాన్ని నేల మట్టం చేయాలని అటువంటి వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని లేదంటే రాష్ట్ర భవిష్యత్తు అంతా అంథకారమైపోతుంది అన్నారు చంద్రాబు.

రాష్ట్రంలో ప్రతీ ఒక్కరు ప్రభుత్వ నిరంకుశ పాలనను అంతమొందించాలని పిలుపునిచ్చారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని భయపడి ఇంట్లోనే కూర్చునే కంటే పోరాడ జైలుకెళ్లి అయినా ఇటువంటి నేలకు తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు చంద్రబాబు.

ట్రెండింగ్ వార్తలు