Perni Nani Comments Chandrababu (1)
Perni Nani – Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. 45 ఏళ్లుగా ఎన్నో స్కాంలు చేసిన చంద్రబాబు మ్యానేజ్ చేస్తూ తప్పించుకున్నాడని పేర్కొన్నారు. చివరికి ఓటుకు నోటు కేసులోనూ తప్పించుకున్నాడని తెలిపారు. ఇన్నాళ్లకు జగన్ లాంటి సరైనోడికి చంద్రబాబు దొరికాడని పేర్కొన్నారు. ఇన్నాళ్లకు న్యాయం గెలిచింది అనే భావన తెలుగు ప్రజల్లో కలిగిందని అన్నారు. ఈ కేసులో ఇది తీగ మాత్రమేనని ఇంకా డొంక అంతా ఉందని త్వరలో కదులుతుందన్నారు.
ఈ మేరకు సోమవారం మంత్రి పేర్ని నాని అమరావతిలో మీడియాతో మాట్లాడారు. అరెస్టు జరుగుతుందని మూడు రోజుల ముందే చంద్రబాబుకి తెలుసు అని తెలిపారు. సీఐడీ అధికారులు చాలా ఓపిక పట్టి చంద్రబాబును గౌరవంగా అరెస్టు చేశారని చెప్పారు. 45 ఏళ్ల అనుభవం, 73 ఏళ్ల వయసు, ప్రతిపక్ష నేత అని పోలీసులు మర్యాదగా వ్యవహరించారని వెల్లడించారు.
YCP MP Vijayasai Reddy: చంద్రబాబు రాజకీయ జీవితం 2023 వరకేనా? ఎలా అంటే.. విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్
హెలికాప్టర్ లో తీసుకెళ్తామంటే పబ్లిసిటీ కోసం కార్ లో వచ్చాడని పేర్కొన్నారు. వైద్య పరీక్షలు వద్దని చంద్రబాబే చెప్పాడు.. అదే వైద్యులు నోట్ చేశారని తెలిపారు. చంద్రబాబుకి జైలులో అన్ని సౌకర్యాలు ఇవ్వడానికి సీఐడీ అంగీకరించిందన్నారు. రూ.370 కోట్లు కొట్టేసినోడికి ఎవరూ ఇంత మర్యాద ఇవ్వరు.. కానీ సీఐడీ వాళ్ళు ఇచ్చారని తెలిపారు.
కోటిన్నర రూపాయలు ఇచ్చి తెచ్చిన లాయర్లు పిచ్చి వాదనలు చేశారు తప్ప స్కాం జరగలేదని చెప్పలేక పోయారని విమర్శించారు. చంద్రబాబు స్టేట్మెంట్ లోనూ స్కాం జరగలేదని చెప్పలేదన్నారు. టెక్నికల్ గా సాకులు చూపించి తప్పుకుందామని ప్రయత్నం చేశారని తెలిపారు. చంద్రబాబు పాపాలు పండాయని స్కాములన్నీ బయటికి వస్తాయని పేర్కొన్నారు.