Roja Selvamani(Photo : Facebook, Google)
Roja Selvamani – Chandrababu Naidu : ఏపీలో సుపరిపాలన అందుతోందని, సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. గుడివాడ నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్షా సమావేశంలో కృష్ణా జిల్లా ఇంఛార్జి మంత్రిగా రోజా పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు కొడాలి నాని, పేర్ని నాని, సింహాద్రి రమేష్ బాబు, కైలే అనిల్ కుమార్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సమావేశంలో మంత్రి రోజా మాట్లాడారు. రాష్ట్రంలో నేతల కంటే ప్రజలే హ్యాపీగా ఉన్నారని రోజా చెప్పారు. గుడివాడ ప్రజలు కొడాలి నానిని ఎంతగానో అభిమానిస్తున్నారని మంత్రి రోజా అన్నారు. ప్రజల వద్దకే ప్రజాప్రతినిధులను పంపుతున్న సీఎం జగన్ కు రాష్ట్ర ప్రజానీకం మద్దతు పలుకుతోందని పేర్కొన్నారు.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అల్జీమర్స్ వ్యాధిగ్రస్తుడిలా చంద్రబాబు తయారయ్యారు అని వ్యాఖ్యానించారు. ”టీడీపీ హయాంలో అప్పటి మంత్రులే గంజాయి సాగుపై బహిరంగంగా మాట్లాడారు. నాటి విషయాలను మరిచిన చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు.
సెబ్ వ్యవస్థను తీసుకొచ్చి రాష్ట్రంలో గంజాయిపై ఉక్కుపాదం మోపాం. కుంభకోణాల కర్ణుడు చంద్రబాబు. హాలిడేకు వచ్చినట్లు రాష్ట్రానికి వచ్చి రైతుల గురించి మాట్లాడుతున్నారు. వ్యవసాయం దండగ అని రైతుల జీవితాలను నాశనం చేసి కాల్పులు జరిపించిన చంద్రబాబు.. నేడు రైతులపై కల్లబొల్లి ప్రేమ వలకబోస్తున్నారు. రైతులకు ఇచ్చిన హామీలను టీడీపీ హయాంలో ఎంతవరకు అమలు చేశారు.
అంపశయ్య మీదున్న రైతులను బతికించింది నాడు వైయస్సార్, నేడు జగన్ మోహన్ రెడ్డి. రైతన్నలు సమస్యలపై రోడ్డెక్కే పని లేకుండా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం. అల్పపీడన కారణంగా కురుస్తున్న వర్షాలతో రైతులు ఆందోళన చెందనవసరం లేదు. నష్టపోయిన ప్రతి రైతుని జగన్ ప్రభుత్వం ఆదుకుంటుంది” అని మంత్రి రోజా భరోసానిచ్చారు.
Also Read..Kuppam: వైనాట్ 175 అంటున్న వైసీపీ.. కొత్త టార్గెట్ పెట్టుకున్న చంద్రబాబు.. రీచ్ అవుతారా?
కృష్ణా జిల్లా ఇంఛార్జి మంత్రిగా రోజా అధ్యక్షతన గుడివాడ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో అన్ని పభుత్వ శాఖలపై సమీక్షించారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై సమీక్ష జరిపారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు తెలుసుకొని ఆయా సమస్యలను జిల్లా కలెక్టర్, జిల్లా, నియోజకవర్గ అధికారులకు తెలియజేశారు. వాటి పరిష్కారాలకై చర్చించారు. అధికారులకు పలు సలహాలు, సూచనలు చేసి ప్రతి సమస్య వీలైనంత త్వరగా పరిష్కరించాలని తద్వారా సీఎం జగన్ కి, వైసీపీ ప్రభుత్వనికి మంచి పేరు తేవాలని అధికారులను ఆదేశించారు మంత్రి రోజా.