Chandrababu Case : చంద్రబాబు చుట్టూ బిగుస్తున్న కేసుల ఉచ్చు.. బాబు ఇక తప్పించుకోలేరా? భవిష్యత్తు ఏంటి?

వరుస కేసులు పెడుతూ ఏపీ ప్రభుత్వం చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. Chandrababu Case - Fibernet Scam

Chandrababu Case - Fibernet Scam

Chandrababu Case – Fibernet Scam : టీడీపీ అధినేత చంద్రబాబు చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తోంది. ఏపీ ప్రభుత్వం వరుస కేసులో చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేసే ప్లాన్ లో ఉంది. ఇప్పటికే చంద్రబాబుపై సీఐడీ మూడు కేసులు నమోదు చేసింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ అవగా, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో పీటీ వారెంట్ దాఖలు చేసింది. ఇప్పుడు తాజాగా ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబును నిందితుడిగా పేర్కొంటూ ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేసింది సీఐడీ.

సీఐడీ మరో కేసు..
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజాగా చంద్రబాబుపై సీఐడీ మరో కేసు పెట్టింది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబును నిందితుడిగా పేర్కొంటూ పీటీ వారెంట్ దాఖలు చేసింది. టెరాసాఫ్ట్ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా ఫైబర్ నెట్ కాంట్రాక్ట్ ఇచ్చారని అభియోగాలు మోపారు. పీటీ వారెంట్ కు అనుబంధంగా మెమో దాఖలు చేశారు. ఈ కుంభకోణంలో ఏ-25గా చంద్రబాబుని చేర్చారు. త్వరలోనే విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ కేసుతో కలిపి మొత్తం 3 కేసులతో చంద్రబాబుని చుట్టుముట్టే ప్రయత్నం చేస్తోంది ఏపీ సర్కార్.

Also Read..Chandrababu Quash Petition : చంద్రబాబు క్వాష్ పిటిషన్.. తీర్పు రిజర్వ్, కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్టు, 30రోజుల్లో ఎప్పుడైనా తీర్పు వెలువరించే అవకాశం

ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ లో రూ.119 కోట్ల నిధులు గోల్ మాల్..
ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ లో రూ.119 కోట్ల నిధులు గోల్ మాల్ అయినట్లు సిట్ దర్యాఫ్తులో తేలింది. 2021లోనే ఫైబర్ నెట్ స్కామ్ లో 19మందిపై సీఐడీ కేసులు నమోదు చేసింది. ఏ-1గా వేమూరి హరిప్రసాద్, ఏ-2గా మాజీ ఎండీ సాంబశివరావు ఉన్నారు. చంద్రబాబుకు వేమూరి హరిప్రసాద్ అత్యంత సన్నిహితుడు అని సీఐడీ పేర్కొంది. ఈ స్కామ్ లో చంద్రబాబు పాత్రను గుర్తించిన సీఐడీ టెరాసాఫ్ట్ కు అక్రమ మార్గంలో టెండర్లు ఇవ్వడంపై విచారణ చేపట్టింది.

బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీకి టెండర్లు..
టెరాసాఫ్ట్ కంపెనీ గతంలో ఏపీ సివిల్ సప్లయ్స్ కు సేవలు అందించింది. నాసిరకం మిషన్లు పంపిణీ చేసినందుకు ఆ కంపెనీని ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టింది. అయినా టెరాసాఫ్ట్ సంస్థకు చంద్రబాబు టెండర్లు కట్టబెట్టారని ఆరోపణలు ఉన్నాయి. బ్లాక్ లిస్టులో పెట్టిన 2 నెలల తర్వాత అందులోంచి కంపెనీని తొలగించారు. దీంతో హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ కంపెనీతో జట్టుకట్టి ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ దక్కించుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ కంపెనీని బయటకు పంపించారని గుర్తించారు. ఇప్పటికే ఆ కంపెనీ వైస్ ప్రెసిడెండ్ అనిల్ జైన్ స్టేట్ మెంట్ ను సీఐడీ రికార్డ్ చేసింది. తమను మోసం చేసినట్లు ఆయన వాంగ్మూలం ఇచ్చారని పేర్కొంది.

క్వాష్ పిటిషన్.. తీర్పు రిజర్వ్..
మరోవైపు ఇప్పటికే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో పీటీ వారెంట్ దాఖలు చేసింది సీఐడీ. దీనిపై చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ గురువారానికి(సెప్టెంబర్ 21) వాయిదా పడింది. ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో విచారణ కొనసాగుతోంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కి సంబంధించి ఏపీ హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘంగా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. వరుస కేసులు పెడుతూ ఏపీ ప్రభుత్వం చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అయితే, కావాలనే చంద్రబాబుని ఇరికిస్తున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

Also Read..Chandrababu Case : చంద్రబాబు కేసులో హేమాహేమీలు, నలుగురూ పేరున్న క్రిమినల్ లాయర్లే.. ఎవరి వాదన నెగ్గుతుంది? సర్వత్రా ఉత్కంఠ

విచారణలో కోర్టు జోక్యం చేసుకోవద్దు- ముకుల్ రోహత్గీ
చంద్రబాబు పిటీషన్లపై ఏపీ హైకోర్టు, ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది. క్వాష్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. ఇరువర్గాల న్యాయవాదులు సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. చంద్రబాబు తరపున హరీశ్ సాల్వే, సిద్ధార్ధ లూథ్రా వాదించారు. సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. రెండు రోజుల్లో తీర్పు ఇస్తామని వెల్లడించింది. క్వాష్ పిటిషన్ పై ఇరువర్గాల మధ్య చాలా సుదీర్ఘంగా వాడీవేడి వాదనలు జరిగాయి.

దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కేసులను లాయర్లు ప్రస్తావించారు. 17ఏ ఆఫ్ పీసీ యాక్ట్ చంద్రబాబుకు వర్తించదని సీఐడీ తరపు న్యాయవాదులు తెలిపారు. అది పబ్లిక్ సర్వెంట్స్ కి మాత్రమే వర్తిస్తుందని వివరించారు. నిహారిక ఇన్ ఫ్రా స్ట్రక్చర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసు ఆధారంగా క్వాష్ పిటిషన్ లో కోర్టు మినీ ట్రయల్ చేయకూడదన్నారు. విచారణలో జోక్యం చేసుకోవద్దని కోరారు. వివిధ పిటిషన్లు వేసి కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నారని వాదించారు. పిటిషన్ ను డిస్మిస్ చేయాలన్నారు.

చంద్రబాబుది అక్రమ అరెస్ట్, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు-హరీశ్ సాల్వే
చంద్రబాబు తరపున న్యాయవాది హరీశ్ సాల్వే కౌంటర్ వాదనలు వినిపించారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారని, చట్టాన్ని ఉల్లంఘించారని తెలిపారు. ప్రభుత్వం కక్షపూరితంగా చంద్రబాబుని జైలుకి పంపిందని వాదించారు. ఇటువంటి అరెస్టుల అనుమతిపై ప్రభుత్వాలు తమ వ్యతిరేకులపై ఏమైనా చేయగలదు అనే భావన ప్రజల్లో ఏర్పడుతుందని వాదనలు వినిపించారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. మరోవైపు సీఐడీ కస్టడీ పిటీషన్, చంద్రబాబు బెయిల్ పిటీషన్లపై ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. కస్టడీపై కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు. క్వాష్ పిటీషన్ పై హైకోర్టులో విచారణ దృష్ట్యా కౌంటర్ దాఖలుకు రేపటివరకు(సెప్టెంబర్ 20) సమయం కావాలన్నారు. దీనికి ఏసీబీ కోర్టు అంగీకరించింది. అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

ట్రెండింగ్ వార్తలు