Gudivada Amarnath : చంద్రబాబు చేసిన అక్రమాలను ప్రజలకు చూపించాలన్నదే మా ప్రయత్నం, ఇందులో కక్ష లేదు- మంత్రి గుడివాడ అమర్నాథ్

పెద్దమనిషిగా చలామణి అవుతూ అనేక అక్రమాలు చేశారు. ఆయన చేసిన పాపాలు పండాయి. Gudivada Amarnath - Chandrababu Remand

Gudivada Amarnath - Chandrababu Remand (Photo : Google)

Gudivada Amarnath – Chandrababu Remand : స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకి ఊహించని షాక్ తగిలింది. విజయవాడ ఏసీబీ కోర్టు చంద్రబాబుకి రిమాండ్ విధించింది. ఈ నెల 22వ తేదీవరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది కోర్టు. విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందు ఆదివారం (సెప్టెంబర్ 10) రాత్రి 7గంటల ప్రాంతంలో తీర్పు చదివి వినిపించారు.

అంతకుముందు కోర్టులో సుదీర్ఘమైన వాదనలు జరిగాయి. జడ్జి తీర్పుని రిజర్వ్ చేశారు. ఎలాంటి తీర్పు వస్తుందోనని అంతా ఉత్కంఠగా చూశారు. చివరికి చంద్రబాబుకి రిమాండ్ విధిస్తూ తీర్పు వచ్చింది. చంద్రబాబుకి రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడంతో టీడీపీ శ్రేణులు తీవ్రంగా నిరుత్సాహాపడ్డాయి. అటు వైసీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.

Also Read..Andhra Pradesh Bandh: ఆంధ్రప్రదేశ్ బంద్‌కు టీడీపీ పిలుపు

చంద్రబాబు రిమాండ్ పై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. చంద్రబాబును స్కిల్డ్ క్రిమినల్ గా ఆయన అభివర్ణించారు. అలాంటి దొంగ ఫస్ట్ టైం చట్టానికి దొరికిపోయారు అని అన్నారు. కోర్టు బోనెక్కారు, కటకటాల వెనక్కు వెళ్లారు అని కామెంట్ చేశారు.

”చంద్రబాబు అభినవ వీరప్పన్. పెద్దమనిషిగా చలామణి అవుతూ అనేక అక్రమాలు చేశారు. ఆయన చేసిన పాపాలు పండాయి. ఇన్ని పాపాలు, నేరాలు, ఘోరాలు, అక్రమాలు చేసిన వ్యక్తి చంద్రబాబు. ఎంత పెద్ద లాయర్లను తెచ్చినా చేసిన తప్పులకు శిక్ష తప్పలేదు. నేను తప్పు చేయలేదు అనే మాట ఇంతవరకు చంద్రబాబు చెప్పలేదు. ఎంతసేపు టెక్నికల్ పాయింట్స్ మాట్లాడటమే తప్ప చేసిన తప్పుడు పనుల గురించి మాట్లాడలేదు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో కర్త, కర్మ, క్రియ, సూత్రధారి చంద్రబాబే.

చంద్రబాబును అరెస్టు చేయటం వలన మేము ఆనందపడాల్సిన పని లేదు. ఆయన చేసిన అక్రమాలను ప్రజలకు చూపించాలని ప్రయత్నం చేశాం. అంతే తప్ప ఇందులో కక్షసాధింపు లేదు. 40ఏళ్లుగా చంద్రబాబు తప్పించుకుని తిరుగుతున్నారు. ఓటుకు నోటు కేసులో కూడా చంద్రబాబు దొరికిపోయారు. దత్తపుత్రుడు ఒక పక్క నడక, ఇంకో పక్కన పడక సీన్లతో వేషాలేస్తున్నారు. ఆయనకు కూడా ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదు.

చంద్రబాబు అనేక వ్యవస్థల్లో స్లీపర్ సెల్స్ ని మెయింటైన్ చేశారు. వారి ద్వారానే 40ఏళ్లుగా రాజకీయం చేస్తూ వచ్చారు. వీటన్నిటికీ ఇప్పుడు పుల్ స్టాప్ పడింది. పాత కేసుల గురించి పక్కన పెడితే.. మళ్ళీ గడిచిన ఐదేళ్లలో చేసిన అనేక స్కాంలు చేశారు. వీటన్నిటిపై కూడా విచారణ జరిగి తీరుతుంది. ఎల్లో మీడియా చంద్రబాబు అక్రమ సామ్రాజ్యానికి వత్తాసు పలుకుతోంది.

Also Read..Chandrababu Remand: ఈ నెల 22 వరకు చంద్రబాబుకి జ్యుడీషియల్ రిమాండ్.. బెయిల్ పిటిషన్ దాఖలు

ఏం పీక్కుంటారో పీక్కోండన్న టీడీపీ నేతలు ఇప్పుడు ఏం మాట్లాడతారు? అవినీతికి ప్యాంటు, షర్టు వేస్తే అది చంద్రబాబే. చంద్రబాబు చేసిన స్కాంలలో ఇది మొదటిది మాత్రమే. ఇక చంద్రబాబు శేష జీవితం జైల్లోనే గడపాలి. టీడీపీ పిలుపిచ్చిన బంద్ కు ప్రజలు సహకరించరు. చంద్రబాబేమైనా స్వాతంత్ర్య సమరయోధుడా? పెద్ద అవినీతిపరుడు, అక్రమార్కుడు. చంద్రబాబును అరెస్టు చేస్తే లోకేశ్ కంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ ఎక్కువ బాధ పడుతున్నారు” అని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు