Chandrababu Naidu: 10టీవీ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ 10 టీవీ నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అక్కడి నుంచే ఆయన 10 టీవీ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.

క్యాలెండర్ చక్కగా ఉందంటూ 10 టీవీకి చంద్రబాబు నాయుడు కితాబు ఇచ్చారు. ఈ ఏడాది నూతన సంవత్సర క్యాలెండర్ 10టీవీ అన్ని హంగులతో ముద్రించింది. క్యాలెండర్‌ను పరిశీలించి చంద్రబాబు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కూడా పాల్గొన్నారు.

కాగా, చంద్రబాబు నాయుడు నిన్న, మొన్న కుప్పంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడి వారి కష్టసుఖాల గురించి తెలుసుకున్నారు. కుప్పంలో “జననాయకుడు సెంటర్”ను ప్రారంభించారు.

ప్రజల నుంచి వినతులు స్వీకరణ కార్యక్రమం చేపట్టారు. కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. గత రాత్రి ఆర్‌అండ్‌బి అతిథి గృహం చేరుకుని అక్కడే బస చేశారు. ఇవాళ ఆయన కుప్పం నుంచి విజయవాడకు వెళ్లే అవకాశం ఉంది.

ఏపీ ఇంటర్మీడియట్‌ విద్యలో సంస్కరణలు.. ఫస్టియర్ సంవత్సరాంతర పరీక్షలు తొలగిస్తాం: కృతికా శుక్లా