ఏపీ ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణలు.. ఫస్టియర్ సంవత్సరాంతర పరీక్షలు తొలగిస్తాం: కృతికా శుక్లా
"ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యా విధానం 2025-26"లో ఇంటర్మీడియెట్ విద్యా మండలి సిలబల్‌కు అనుగుణంగా పాఠ్యపుస్తకాలను ప్రవేశపెట్టడంపై అభిప్రాయాలు తీసుకుంటామన్నారు.

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణలు చేపడుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. సంస్కరణల కోసం విద్యార్థులు సహా తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి సలహాలు తీసుకుంటామని చెప్పారు. ఇంటర్మీటియట్ మొదటి సంవత్సరాంతర పరీక్షలను తొలగిస్తామన్నారు. ఇంటర్ కాలేజీలు అంతర్గతంగా ఫస్టియర్ పరీక్షలు నిర్వహిస్తాయని, సెకండియర్ పరీక్షలను బోర్డు నిర్వహిస్తుందని చెప్పారు.
విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలని ఫస్టియర్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించకుండా, సెకండియర్‌లోనే నిర్వహించాలని ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. “పది సంవత్సరాలు గా విద్యా వ్యవస్థలో సంస్కరణలు జరగలేదు. టెక్స్ బుక్స్ రివిజన్ చేయలేదు. బీఐఈ, ఆర్ట్స్ సబ్టెక్ట్ లలో పదేళ్లుగా రివిజన్ లేదు. సైన్స్, ఆర్ట్స్ లో ఇంటర్మీడియట్ టెక్స్ బుక్స్ ప్రింట్ చేయాలి. ఫస్ట్ ఇయర్ కు అన్నీ కొత్త బుక్స్ ఉంటాయి. ఈ సిలబస్ డిజైన్ చేసేటప్పుడు అన్ని విభాగాల లెక్చరర్ లతో చర్చించి నిర్ణయం తీసుకున్నాం. ఎంసీఆర్టీ సిలబస్ లో కొన్ని సబ్జెక్టులలో సిలబస్ తగ్గుతుంది.
ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల సూచనల కోసం సబ్జెక్టుల వారీగా సిలబస్ ను ఇంటర్మీడియట్ విద్యా మండలి పోర్టల్ bie.AP.gov.inలో పొందుపరుస్తున్నాం. సీబీఎస్సీకి అనుగుణంగా ఇంటర్మీడియట్ సిలబస్, పరీక్షల్లో మార్పులు చేస్తున్నాం.
ఇంటర్మీడియట్ ప్రధమ సంవత్సరం విద్యా విధానం 2025-26లో ఇంటర్మీడియెట్ విద్యా మండలి సిలబల్ అనుగుణంగా పాఠ్యపుస్తకాలు ప్రవేపెట్టడంపైన అభిప్రాయాలు తీసుకుంటాం. అలాగే, ద్వితీయ సంవత్సరంలో ప్రస్తుతం ఉన్న సిలబస్ యథావిధిగా కొనసాగిస్తూ 2026-27 నుంచి ఇంటర్మీడియట్ విద్యా మండలి సిలబల్ కు అనుగుణంగా పాఠ్యపుస్తకాలు ప్రవేశపెట్టడంపై అభిప్రాయాలు తీసుకుంటాం. ప్రతి సబ్జెక్టులో ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయి” అని తెలిపారు.
Anita Anand: కెనడా ప్రధాని పదవి రేసులో భారత సంతతి నాయకురాలు.. ఎవరీ అనితా ఆనంద్?