Daggupati Prasad: అనంతపురం అర్బన్ టీడీపీలో ఆధిపత్య పోరు.. సిట్టింగ్ ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే.. వివాదానికి అసలు కారణం అదేనా?
14 నెలలుగా తనపై కుట్రలు చేయడమే పనిగా పెట్టుకున్నారని..అలాంటి వారు తగిన మూల్యం చెల్లించుకుంటారంటూ వార్నింగ్ ఇస్తున్నారు.(Daggupati Prasad)

Daggupati Prasad: నియోజకవర్గం ఏదైనా..ఇద్దరు టికెట్ ఆశావహులు ఉంటే..ఆ కిక్కే వేరు. ఎవరి ఎజెండా వారికి ఉంటుంది. ఎవరి ప్లాన్ వారిది. మెరిసేదంతా బంగారం కాదని..రాజకీయ నాయకులు బయటికి చెప్పేదంతా కూడా నిజం కాదనేది ఓపెన్ సీక్రెట్. ఇలాగే అనంతపురంలో ఇద్దరు టీడీపీ నేతలు ఏడాదిగా నువ్వానేనా అన్నట్లుగా ఫైటింగ్‌కు దిగుతున్నారు.
గత ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన బాధలో ఉన్న ప్రభాకర్ చౌదరి..వచ్చే ఎన్నికల్లో అయినా బరిలో నిలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. గత ఎన్నికల్లో లాస్ట్ మూమెంట్‌లో టికెట్ మిస్ కావడంతో..నిరాశ చెందారు. చివరకు పార్టీ దగ్గుపాటి ప్రసాద్‌కు టికెట్ ఇచ్చినా ఆయన గెలుపుకోసం పనిచేశారు. ఇక పార్టీ పవర్‌లోకి వచ్చింది..ఆ ఇద్దరి మధ్య వైరం మొదలైందని అన్నట్లుగా మారిందట కథ.
టికెట్ కోసం ఇప్పటినుంచే ఫైట్..
తన సొంత నియోజకవర్గం అనంతపురం అర్బన్‌లో తిరిగి నిలిచి గెలవాలనేది ప్రభాకర్ చౌదరి ప్లాన్ అంటున్నారు. తిరిగి రెండోసారి టికెట్ దక్కించుకోవాలని..ఇక తన సీటును పదిలం చేసుకోవాలనేది దగ్గుపాటి వ్యూహమని చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే అన్నట్లుగా అనంతపురం అర్బన్ టీడీపీ రాజకీయం నడుస్తోందట. అసలు మ్యాటర్ ఇదే అయినా..పైకి మాత్రం వేరే అంశాలను ప్రస్తావించుకుంటూ ఒకరిపై మరొకరు అప్పర్ హ్యాండ్ సాధించుకోవాలని స్కెచ్ వేస్తున్నారట.
పాత విషయాలను తవ్వుకునేదాకా వెళ్లారు..
అభివృద్ధి, అవినీతి అంశాలపై అనంతపురం అర్బన నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే పరస్పర విమర్శలకు దిగుతున్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం చర్చకు దారితీస్తోంది. ఓ ఆస్పత్రి వివాదంతో మొదలై..పాత విషయాలను తవ్వుకునేదాకా వెళ్లారు. తనపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు చేయడం వెనుక మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఉన్నారనేది ఎమ్మెల్యే దగ్గుపాటి అలిగేషన్.
తాను వచ్చినప్పటి నుంచి కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపణ..
అయితే సీపీఐ రామకృష్ణతో తాను మాట్లాడితే తప్పేంటని ప్రభాకర్ చౌదరి ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు నాయకులు పోటాపోటీగా ప్రెస్‌మీట్లు పెట్టి ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది.
తాను వచ్చినప్పటి నుంచి కుట్రలు చేస్తున్నారంటూ..ప్రభాకర్ చౌదరిపై ఇండైరెక్ట్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. మళ్లీ తనకే టిక్కెట్ ఇస్తారేమోనన్న భయంతో పార్టీలోనే ఉన్న మరో నాయకుడు బురద జల్లుతున్నారని..పార్టీ నిర్ణయమే శిరోధార్యమంటున్నారు.
పనిగట్టుకుని ప్రభాకర్ చౌదరి తనపై..తన కుటుంబపై నెగెటివ్ ప్రాపగాండ చేయిస్తున్నారని.. పరోక్షంగా విమర్శల దాడి చేశారు ఎమ్మెల్యే దగ్గుపాటి. 14 నెలలుగా తనపై కుట్రలు చేయడమే పనిగా పెట్టుకున్నారని..అలాంటి వారు తగిన మూల్యం చెల్లించుకుంటారంటూ ఇండైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నారు.
ఇక దగ్గుపాటి కామెంట్స్‌పై సీరియస్‌గా రియాక్ట్ అవుతున్నారు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి. దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రా.. పోటీ చేద్దాం. ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయో చూద్దాం అంటూ సవాల్ చేస్తున్నారు. అంతేకాదు దగ్గుపాటి సమాధులను ఆక్రమించిన వ్యక్తి అని, ఇతర పార్టీల నుంచి వచ్చి తనను నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అడుగుతున్నారని మండిపడుతున్నారు.
అర్ధరాత్రి టికెట్ తెచ్చుకున్నా పార్టీ కోసం పని చేశా. కష్టపడినోళ్లపై బురద చల్లుతావా.? అంటూ ఫైర్ అవుతున్నారు ప్రభాకర్ చౌదరి. పార్టీ కోసం శ్రమించిన వాళ్లనే స్టేషన్లలో పోలీసులతో చితకబాదించింది నిజం కాదా? రాత్రి మందు తాగి మాట్లాడే వారెవరో అందరికీ తెలుసంటూ పర్సనల్ అటాకింగ్ మొదలు పెట్టారు.
ఇలా సిట్టింగ్ ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే మధ్య ఇప్పటినుంచే టికెట్ ఫైట్ నడుస్తోంది. గత ఎన్నికల్లోనే లాస్ట్ మూమెంట్‌లో దగ్గుపాటి ప్రసాద్‌కు టికెట్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. టికెట్ ఆశించి నిరాశపడ్డ ప్రభాకర్ చౌదరి అప్పుడు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారన్న ఊహాగానాలు వినిపించాయి. చివరకు టీడీపీ అధినాయకత్వం సర్ధి చెప్పడంతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని పార్టీ కోసం పనిచేసినట్లు గుర్తు చేస్తున్నారు. ఇక ఇప్పుడు దగ్గుపాటి టార్గెట్ ప్రభాకర్ చౌదరి..ప్రభాకర్ చౌదరికి కౌంటర్‌గా దగ్గుపాటి కౌంటర్ ఆపరేషన్ చేస్తున్నారనే..ఈ క్రమంలో టాపిక్ ఏదైనా..సబ్జెక్ట్ మరేదైనా రచ్చకెక్కుతున్నారన్న డిస్కషన్ జరుగుతోంది.
Also Read: జగన్ అడ్డాలో ఏమైంది.. వైసీపీకి ఎందుకీ పరాభవం? నాటి ఆ నిర్లక్ష్యమే నేటి ఈ ఓటమికి కారణమా?