×
Ad

Chandrababu Naidu: “ఇలాగైతే మీకే నష్టం” అంటూ ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్.. ఇకపై..

ఎమ్మెల్యేల వర్క్ స్టైల్‌ బాలేదని..చాలామంది ఎమ్మెల్యేలు యాక్టీవ్‌గా ఉండటం లేదని..ఈ మధ్యే సీరియస్‌ అయ్యారు చంద్రబాబు.

Chandrababu Naidu: పనితీరే గీటురాయి. అది సీఎంగా తనకైనా..మంత్రులకైనా..ఎమ్మెల్యేలకైనా. అందరూ బాగా పనిచేస్తేనే మళ్లీ గెలుస్తాం. అధికారంలోకి వస్తాం. మీ పనితీరు బాలేకపోతే మీకే నష్టం. ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు చేస్తున్న దిశానిర్దేశం ఇది. అంతా అధిష్టానం చూసుకుంటుంది..టికెట్ ఇస్తే గెలిచి వస్తామంటే కుదరదు. బాగా పనిచేయాలి. ప్రజల్లోనే ఉండాలి. పాస్‌ మార్కులు తెచ్చుకుంటే సరిపోదు. పక్కాగా హండ్రెడ్‌ మార్క్స్‌ రావాల్సిందే.

ఈ క్రమంలో ఆ మధ్య మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. సరిగ్గా పనిచేయట్లేదని పలువురిని మందలించారు. ఏకంగా క్యాబినెట్ షఫ్లింగ్‌..పలువురిని మార్చి కొత్తవారిని తీసుకుంటారన్న ప్రచారం కూడా జరిగింది. దీంతో మంత్రులంతా నియోజకవర్గాల బాట పట్టారు. నిత్యం ప్రజల్లో ఉంటూ..పనులు చేసి పెడుతూ మారినట్లుగా చూపించారు. (Chandrababu Naidu)

కట్‌ చేస్తే ఎమ్మెల్యేల వర్క్ స్టైల్‌ బాలేదని..చాలామంది ఎమ్మెల్యేలు యాక్టీవ్‌గా ఉండటం లేదని..ఈ మధ్యే సీరియస్‌ అయ్యారు చంద్రబాబు. 48 ఎమ్మెల్యేలకు నోటీసులు అంటూ బిగ్ స్టేట్‌మెంట్‌ ఇచ్చి అందరిని సెట్‌రైట్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సీఎం చంద్రబాబు పదే పదే మంత్రులు, ఎమ్మెల్యేలపైనే ఎందుకు దృష్టి పెడుతున్నట్లు అంటే..పనితీరే ఇంపార్టెంట్‌ అని భావిస్తున్నారట. ప్రభుత్వం ఎంత బాగా పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు బాగుంటేనే ప్రజలు మళ్లీ పట్టం కడుతారని..అందుకే అమాత్యులు, శాసనసభ్యుల తీరు మారేలా ప్రెజర్ తెస్తున్నారని అంటున్నారు.

Also Read: Donald Trump : ట్రంప్ కొత్త రాగం.. హెచ్‌-1బీ వీసాలపై సంచలన ప్రకటన.. వారికి శుభవార్త

అయితే లేటెస్ట్‌గా మంత్రులను చంద్రబాబు ప్రశంసించారు. ఇది ఊహించని అమాత్యులు కూడా అవ్వాక్కయ్యారట. ఇప్పటివరకు చాలాసార్లు మంత్రి వర్గ సమావేశం జరిగింది. మంత్రులకు బాబు క్లాస్ తీసుకున్నారనో లేక వారిపై సీరియస్ అయ్యారనో లేక దిశానిర్దేశం చేశారనో వార్తలు వస్తూ ఉండేవి. మంత్రులు మరింత చురుగ్గా పనిచేయాలని బాధ్యతగా మెలగాలని బాబు కోరినట్లుగా కూడా ప్రచారం జరిగేది. కానీ లేటెస్ట్‌గా జరిగిన క్యాబినెట్‌ భేటీలో మాత్రం మంత్రులను మెచ్చుకున్నారు చంద్రబాబు. మంత్రులు అందరినీ శభాష్ అని చంద్రబాబు మెచ్చుకోవడంతో అంతా ఫుల్ జోష్‌లో ఉన్నారట.

మొంథా తుఫాన్ సమయంలో మంత్రులు అంతా ఫీల్డ్‌లోకి దిగి పనిచేశారు. ప్రజలను అలర్ట్ చేయడంతో పాటు సహాయ చర్యలు బాగా చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. నిజానికి మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి చంద్రబాబు కోరుకుంటున్నది ఇదే. సీఎం స్థాయి నుంచి కిందివరకు అంతా ఒక సిస్టమ్‌ ప్రకారం పనిచేయాలని పదే పదే చెబుతూ వస్తున్నారు. ఆయన కోరుకున్న టీమ్‌ స్పిరిట్ మొంథా తుఫాన్‌ సందర్భంగా కనిపించడంతో బాబు ఫుల్‌ హ్యాపీ అంటున్నారు. అందుకే మంత్రులను మెచ్చుకున్నారని చెబుతున్నారు. అయితే పలువురు ఎమ్మెల్యేల విషయంలో మాత్రం చంద్రబాబు ఇప్పటికీ సీరియస్‌గానే ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. వాళ్ల పనితీరు మారే వరకు వదిలిపెట్టరని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు.

ఇలా అయితే ప్రభుత్వం చులకన అవుతుందంటూ..
లేటెస్ట్‌గా డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కూడా ఎమ్మెల్యేలు ప్రజల వివాదాల్లో తలదూరుస్తున్నారని, బెదిరిస్తున్నారని మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావించారు. ఇలా అయితే ప్రజల్లో ప్రభుత్వం చులకన అవుతుందన్నారు. తప్పు చేసిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని సూచించారు. కొందరు అధికారుల తీరు సరిగా లేదన్నారు. ఎమ్మెల్యేలు సివిల్ వివాదాల్లో తల దూరుస్తున్నారని..చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు పవన్.

కూటమిలో ఏ పార్టీ ఎమ్మెల్యే తప్పు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబును కోరారు సేనాని. మంత్రి నారా లోకేశ్ కూడా కొందరు ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫస్ట్‌ టైమ్‌ గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలకు మంచిచెడులు తెలియడం లేదన్న ఆయన..అవగాహనా రాహిత్యం, అనుభవలేమితో సమన్వయం ఉండట్లేదని అభిప్రాయపడ్డారట.

ఈ విషయంపై సీనియర్‌ ఎమ్మెల్యేలు, నేతలు..కొత్తగా ఎన్నికైన వారికి అవగాహన కల్పించాలని సూచించారు. అయితే ప్రభుత్వ పెద్దల కోపం వెనుక పెద్ద రీజనే ఉందంటున్నారు. తమ ఎమ్మెల్యేలను తామే చీవాట్లు పెట్టి..పనితీరు మార్చుకునేలా చేసి మళ్లీ గెలవాలనేది కూటమి వ్యూహంగా చెబుతున్నారు. ప్రజల్లో నెగెటివ్‌ ఫీడ్‌ బ్యాక్ వెళ్లకుండా..ప్రభుత్వానికి నష్టం జరగకుండా.. ఎమ్మెల్యేలపై బహిరంగగానే ఆగ్రహం వ్యక్తం చేస్తూ..సరికొత్త స్కెచ్ వేస్తున్నారట. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి మరి.