నేను దేశద్రోహినా : రాజధాని అడిగితే ఏం చెప్పాలి – బాబు

  • Publish Date - January 10, 2020 / 02:21 PM IST

తనను కలిసేందుకు వచ్చే వారిని అడ్డుకుంటున్నారు..నేను దేశ ద్రోహినా ? ఎవరైనా మీ రాజధాని ఏదని అడిగితే ఏం చెప్పాలి ? అమరావతి పేరు చెప్పాలా ? లేక పిచ్చి తుగ్లక్ పేరు చెప్పాలా అని ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు. తూర్పుగోదావరి జిల్లాలో అమరావతి పరిరక్షణ సమితి నిర్వహిస్తున్న బస్సు యాత్ర జరుగుతోంది. ఈ సందర్భంగా కోటిపల్లి బస్టాండు వద్ద బహిరంగసభ నిర్వహించారు.

ఈ సభలో పాల్గొన్న బాబు..వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. కేసులు నమోదు చేయదని డీజీపీ చెబుతున్నారని, పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించకుండా బాధ్యతలు నిర్వర్తించాలని తెలిపారు. అధికారం ఉందని ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే..ఖబడ్దార్ అని హెచ్చరించారు. పోలీసులకు చట్టం తెలియదా ? ఐపీఎస్‌లో ఏం చెప్పారు అని ప్రశ్నించారు. రాగధ్వేషాలకు అతీతంగా పనిచేయాలని చెప్పిందని, చట్టాలను, మానవహక్కులను ఉల్లంఘించి మహిళలు, రైతులు, దళితులపై దాడులు చేస్తారా ? అంటూ నిలదీశారు. 

జగన్ వచ్చినప్పటి నుంచి మూడు ముక్కలాటలాడుతున్నారని, ప్రతొక్క నగరం అభివృద్ధి కావాలని కృషి చేశానని చెప్పారు. 12 మంది రైతులు చనిపోయారంటే బాధ కలగడం లేదా అన్నారు. ప్రజలు తిరగబడితే మీ పోలీస్ స్టేషన్లు సరిపోవన్నారు. 10 వేల ఎకరాల భూమి ఉందని, ఈ భూములను అమ్ముకుంటూ పోతే..ఆదాయం వస్తుందని తెలిపారు. డబ్బులు లేవని కల్లబొల్లి మాటలు చెబుతున్నారని, చేతకాకపోతే తమకు అప్పచెప్పాలన్నారు. నెంబర్ 2గా ఉన్న వ్యక్తి విశాఖలో ఏడు నెలలుగా మకాం వేసి భూములపై కన్నేశాడని ఆరోపించారు బాబు.

Read More : BREAKING NEWS : రాజమండ్రిని 4వ రాజధాని చేయాలి – మంత్రి రంగనాధరాజు