×
Ad

కౌంటర్ స్కెచ్.. టీడీపీ జిల్లా కమిటీలతో జోష్..! అందుకే వారిని స్ట్రాంగ్‌ చేస్తున్న చంద్రబాబు

ఈ ఏడాది స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. అంతేకాదు జూన్‌తో కూటమి పాలనకు రెండేళ్లు పూర్తవుతుంది.

Chandrababu Naidu

TDP: ప్రభుత్వం పరంగా కీలక డెసిషన్స్. ఒక్కో సంక్షేమ పథకం అమలు చేస్తూ..ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తూ..ప్రాబ్లమ్స్ సాటౌట్ చేస్తూ దూకుడుగా ముందుకెళ్తున్నారు సీఎం చంద్రబాబు. కానీ అభివృద్ధి కోసం ఏ నిర్ణయం తీసుకున్నా..విమర్శలు, ఆరోపణలు రావడం కామన్. ఆ అలిగేషన్స్‌ను తిప్పికొట్టేందుకు అదేస్థాయిలో లీడర్లను తయారు చేస్తున్నారు టీడీపీ అధినేత.

విపక్షాల విమర్శలకు దీటుగా సమాధానం చెప్పేలా..నేతలకు కొత్త కొత్త బాధ్యతలు ఇస్తున్నారు. దీంతో ఇప్పుడు అధికార టీడీపీలో పదవుల కోలాహలం నెలకొంది. కొద్దిరోజుల క్రితమే పార్లమెంటరీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను ఎంపిక చేసిన హైకమాండ్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లా పార్టీలో మొత్తం 40 మందితో జంబో టీం ఏర్పాటు చేసేందుకు..జిల్లా పార్టీ అధ్యక్షులకు ఆదేశాలు ఇచ్చింది. గతంలో జిల్లా కమిటీలో 32 మంది ఉంటే..ఇప్పుడు 40మందికి పెంచారు.

Also Read: విలీనం, విభజన.. దూకుడుగా రేవంత్ సర్కార్ డెసిషన్స్.. GHMC ఎన్నికలకు ప్లాన్ చేస్తున్నారా?

పార్లమెంటరీ కమిటీలో 40 మందికి అవకాశం కల్పించడం ద్వారా నేతలకు పదవులు రావడంతో పాటు..స్థానిక ప్రజలకు ఎప్పటికప్పుడు ప్రభుత్వ వాయిస్‌ను వినిపించే అవకాశం దొరుకుతుందని భావిస్తోందట టీడీపీ అధిష్టానం. అందుకే డిస్ట్రిక్ట్ కమిటీలకు సీఎం చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. డెడికేటెడ్‌గా పార్టీ కోసం పనిచేస్తున్నవారిని గుర్తించి బాధ్యతలు ఇస్తే..స్థానిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించొచ్చు అనే ప్లాన్ చేస్తున్నారట.

సోషల్ మీడియా టీమ్‌లను యాక్టివేట్ చేస్తున్న టీడీపీ
ఇకపై జిల్లా, నియోజకవర్గ స్థాయిలో విపక్షాల విమర్శలను దీటుగా తిప్పికొట్టేలా పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో పార్టీ కార్యవర్గంలో మీడియా, సోషల్ మీడియా టీమ్‌లను యాక్టివేట్ చేస్తున్నారట. గ్రౌండ్‌ లెవల్‌లో పనిచేసే నేతలకు జిల్లా కమిటీలో చోటు కల్పించి..సంస్థాగతంగా బూత్ స్థాయి వరకు మరింత పటిష్ట పడాలనేది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. అధికారంలో ఉండి కూడా వైసీపీ విమర్శలకు తగ్గట్టుగా కౌంటర్ అటాక్ ఇవ్వలేకపోతున్నామని పార్టీ హైకమాండ్ భావిస్తోందట. రాష్ట్రస్థాయిలో రియల్‌ టైమ్ రియాక్షన్ ఉన్నప్పటికీ..జిల్లా, నియోజకవర్గాల స్థాయిలో ప్రతిపక్షాలకు సరైన సమాధానం ఇచ్చేలా జిల్లా కమిటీలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారట.

మరోవైపు ఈ ఏడాది స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. అంతేకాదు జూన్‌తో కూటమి పాలనకు రెండేళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో పార్టీ ప్రతిష్టను మరింత పెంచేలా కార్యక్రమాలు నిర్వహించాలనే యోచనతో అధిష్టానం ఉందట. ఇందులో భాగంగా జిల్లా స్థాయిలో 40 మందితో కమిటీని ఏర్పా టు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో 9 మంది ఉపాధ్యక్షులు, 9 మంది కార్యనిర్వాహక కార్యదర్శులు, మరో 9 మంది అధికార ప్రతినిధులు, 9 మంది కార్యదర్శులతోనూ కమిటీని నియమించింది.

కమిటీల్లో అన్ని విభాగాలకు ప్రయారిటీ ఇస్తున్నారు. ఇతర పదవుల్లో భాగంగా కోశాధికారి, కార్యాలయ కార్యదర్శి, మీడియా కో- ఆర్డినేటర్, సోషల్ మీడియా కోఆర్డినేటర్లను నియమించింది. కొత్త కమిటీల వివరాలను జిల్లాల్లోని పార్టీ యంత్రాంగానికి అధిస్థానం పంపింది. రాష్ట్ర కార్యవర్గంలోనూ మార్పులు, చేర్పులకు శ్రీకారం చుడుతోంది. ఈ నెలాఖరులోగా కొత్త టీంను ప్రకటించబోతున్నట్లు చెబుతున్నారు. ప్రతిపక్ష పార్టీల ఆరోపణలకు చెక్ పెట్టగలిగే సామర్ధ్యం ఉన్న లీడర్లను రాష్ట్రపార్టీ కార్యవర్గంలోకి తీసుకోబోతున్నారు. అటు విపక్షాలకు కౌంటర్ ఇచ్చేలా..ఇటు స్థానిక ఎన్నికలకు రెడీ అయ్యేలా..డిస్ట్రిక్ట్‌ కమిటీలను ఫామ్ చేసేలా డైరెక్షన్స్ వెళ్లాయట.