Chandrababu: అంచలంచెలుగా ఎదిగిన వ్యక్తి రోశయ్య -చంద్రబాబు

మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ శ్రీ కొణిజేటి రోశయ్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు.

Chandrababu

Chandrababu: మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ శ్రీ కొణిజేటి రోశయ్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు.

రోశయ్య మృతి బాధాకరమని, రోశయ్య పరిపాలనాదక్షుడిగా, ఆర్థిక నిపుణుడిగా ఖ్యాతి గడించారని అన్నారు. విద్యార్థి సంఘ నాయకుడుగా కెరీర్ మొదలుపెట్టి గవర్నర్ స్థాయికి అంచలంచెలుగా రోశయ్య ఎదిగారని వెల్లడించారు రోశయ్య.

వివాదరహితుడిగా పేరొందిన రోశయ్య.. తనకు అప్పగించిన ఏ బాధ్యతలనైనా సమర్థవంతంగా నిర్వహించేవారని కొనియాడారు. సుదీర్ఘకాలం ఆర్థికశాఖ మంత్రిగా కొనసాగి సేవలను అందించారని అన్నారు చంద్రబాబు.

Konijeti Rosaiah No more: మాజీ సీఎం రోశయ్య ఇకలేరు.. ప్రముఖుల సంతాపం

రోశయ్య మృతి పట్ల కుటుంబ సభ్యులకు, అభిమానులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.