Chandrababu : తల్లి బాధ్యత నువ్వు, తండ్రి బాధ్యత నా భార్య తీసుకున్నారు.. భార్య గురించి పొగిడిన చంద్రబాబు..

చంద్రబాబు మాట్లాడుతూ.. తల్లి బాధ్యతని నువ్వు తీసుకొని బసవతారకం ట్రస్ట్ పెట్టి బాగా నడిపిస్తున్నావు. ఎంతోమందికి ఉచిత వైద్యం చేస్తున్నావు. అలాగే మీ చెల్లి కూడా. భువనేశ్వరి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్, ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ బాధ్యతలని దగ్గరుండి..................

Chandrababu praises her wife Bhuvaneswari

Chandrababu :  బాలయ్య హోస్ట్ గా ఆహాలో చేసిన అన్‌స్టాపబుల్‌ షో భారీ హిట్ అయి రికార్డులని కూడా సాధించడంతో ఈ షోకి సీజన్ 2ని కూడా ప్రకటించి గ్రాండ్ లాంచ్ చేశారు. అన్‌స్టాపబుల్‌ సీజన్ 2 లో మొదటి ఎపిసోడ్ లో అందర్నీ ఆశ్చర్యపరిచే విధంగా చంద్రబాబు, లోకేష్ ని తీసుకొచ్చారు. ఇటీవల దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా, తాజాగా నేడు ఆహాలో మొదటి ఎపిసోడ్ ని రిలీజ్ చేశారు. ఎపిసోడ్ రిలీజైన కొద్దిసేపటికే ఇది వైరల్ గా మారింది.

ఇక మొదటి ఎపిసోడ్ లో మాజీ సీఎం, బాలకృష్ణకు బావ అయిన చంద్రబాబు నాయుడుకి బాలకృష్ణ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. షోలో ఎన్నో సరదా విషయాలు, రాజకీయాలు మాట్లాడారు. తన భార్య గురించి కూడా చంద్రబాబు మాట్లాడారు. తన భార్య చేసే గొప్ప పనుల గురించి చెప్పారు.

Chnadrababu : బిల్‌గేట్స్ ఒక్క నిమిషం మాత్రమే టైం ఇస్తా అన్నాడు.. కానీ ఢిల్లీకి పిలిపించి..

చంద్రబాబు మాట్లాడుతూ.. తల్లి బాధ్యతని నువ్వు తీసుకొని బసవతారకం ట్రస్ట్ పెట్టి బాగా నడిపిస్తున్నావు. ఎంతోమందికి ఉచిత వైద్యం చేస్తున్నావు. అలాగే మీ చెల్లి కూడా. భువనేశ్వరి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్, ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ బాధ్యతలని దగ్గరుండి చూసుకుంటుంది. నాకు మీ చెల్లి అంటే భయం లేదు, గౌరవం ఉంది. నేను రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పుడు తనే ఫ్యామిలీని, హెరిటేజ్ ని దగ్గరుండి చూసుకొని బిజినెస్ లో కూడా పైకి తీసుకెళ్లింది. నేను ఇవాళ ఈ స్టేజిలో ఉన్నానంటే ఆమె సపోర్ట్ వల్లే అని తన భార్యని పొగిడారు.