Chandrababu Quash Petition : చంద్రబాబు క్వాష్ పిటిషన్.. తీర్పు రిజర్వ్, కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్టు, 30రోజుల్లో ఎప్పుడైనా తీర్పు వెలువరించే అవకాశం

చంద్రబాబు తరపున హరీశ్ సాల్వే, లూథ్రా వాదించారు. సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. Chandrababu Arrest

Chandrababu Quash Petition

Chandrababu Quash Petition – AP High Court : చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. కోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది. మంగళవారం(సెప్టెంబర్ 19) ఉదయం నుంచి ఇరువర్గాల న్యాయవాదులు సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. చంద్రబాబు తరపున హరీశ్ సాల్వే, లూథ్రా వాదించారు. సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పుని రిజర్వ్ చేసింది.

చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఇందులో ప్రధానంగా 17ఏ పై నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు తరపు లాయర్లు కోర్టును కోరారు. సుదీర్ఘ వాదనలు విన్న న్యాయస్థానం తీర్పుని రిజర్వ్ లో పెట్టింది. హైకోర్టు సీనియర్ లాయర్ శర్మ స్పందించారు.

Also Read..Chandrababu Arrest: చంద్రబాబుపై మరో కేసు.. ఏసీబీ కోర్టులో ఫైబర్ నెట్ స్కామ్‌పై పీటీ వారెంట్ వేసిన సీఐడీ

”482 పిటిషన్ పై ఉదయం నుంచి వాదనలు జరిగాయి. ముఖ్యంగా వాళ్లు కోరేది ఏమిటంటే.. రిమాండ్ ఆపాలని, ఎఫ్ఐఆర్, ఇన్వెస్టిగేషన్ పై స్టే ఇవ్వాలని కోరారు. న్యాయస్థానం ఎటువంటి ఆర్డర్లు పాస్ చేయలేదు. పూర్తి స్థాయిలో వాదనలు విని 482 పిటిషన్ పై ఫైనల్ తీర్పు ఇవ్వాలని అనుకున్నట్లు న్యాయస్థానం తెలిపింది. ఏదో ఒకదాని మీద ఆర్డర్స్ పాస్ చేయాలని అనుకోలేదని, ఇంత సుదీర్ఘంగా వాదనలు విన్న తర్వాత మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం కరెక్ట్ కాదని న్యాయస్థానం పేర్కొంది. తీర్పుని రిజర్వ్ చేశారు. ఎప్పుడు తీర్పు వెల్లడిస్తారో కూడా తెలీదు. ఈ కేసులో పూర్తి స్తాయి ఆర్డర్స్ పాస్ చేస్తామని కోర్టు తెలిపింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వదలుచుకోలేదు.

Also Read..Chandrababu Case : చంద్రబాబు కేసులో హేమాహేమీలు, నలుగురూ పేరున్న క్రిమినల్ లాయర్లే.. ఎవరి వాదన నెగ్గుతుంది? సర్వత్రా ఉత్కంఠ

అసలు 17ఏ అప్లికబుల్ కాదని సీఐడీ వాదించింది. లార్జర్ పబ్లిక్ ఇంట్రస్ట్ లో ఉన్న కేసు ఇది. వారు పేర్కొంటున్నట్లు అర్నబ్ గోస్వామి కేసు దీనికి వర్తించదు. ఫండమెంటల్ రైట్స్ కేసు కాదని సీఐడీ క్లియర్ గా చెప్పింది. ఎఫ్ఐఆర్ లో పేరు నమోదు కాకుండానే అరెస్ట్ చేశారని, ఇది రాజకీయాలతో ముడిపడిన అరెస్ట్ అని చంద్రబాబు తరపు లాయర్లు చేసిన వాదనలను న్యాయస్థానం తిప్పికొట్టింది. ఎఫ్ఐఆర్ ఎన్ సైక్లోపీడియా కాదని ముకుల్ రోహత్గీ క్లియర్ గా కోర్టుకి తెలపడం జరిగింది. 30 రోజుల్లో కోర్టు ఎప్పుడైనా ఆర్డర్స్ పాస్ చేయొచ్చు” అని లాయర్ శర్మ తెలిపారు.

Also Read..Brahmani Nara : చంద్రబాబు అరెస్ట్‌తో రాజకీయాల్లోకి నారా బ్రాహ్మణి..? పార్టీ కష్టాల్లో ఉండటంతో బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధం

నిందితుడికి అనుకూలంగా హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకూడదు-ముకుల్ రోహత్గీ
సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదించారు. సీఆర్పీసీ 17ఏ పై వాదనలు వినిపించారు. ఏ గణపతి వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడుతో పాటు చంబునాథ్ మిశ్రా కేసులో తీర్పులను ముకుల్ రోహత్గీ వివరించారు. ”ఈ దశలో నిందితుడికి అనుకూలంగా హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకూడదు. ఎఫ్ఐఆర్ ఎన్ సైక్లోపీడియా కాదు. 17A చంద్రబాబుకి వర్తించదు. అది పబ్లిక్ సర్వెంట్స్ కు మాత్రమే. నిహారిక ఇన్ ఫ్రాస్ట్రక్చర్ vs స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేస్ ను బట్టి క్వాష్ పిటిషన్ పై కోర్టు మినీ ట్రయల్ చేయకూడదు. ఇన్వెస్టిగేషన్ లో ఇన్వాల్డ్ అవ్వకూడదు. కేసులో విచారణ పూర్తి కాకుండానే కోర్టులు ఇన్వాల్వ్ అవ్వకూడదు” అని సీఐడీ తరపున వర్చ్యువల్ లో వాదనలు వినిపించారు సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ.

”చంద్రబాబు క్వాష్ కు అనర్హుడు. 6 షెల్ కంపెనీలకు డబ్బులు తరలించి విత్ డ్రా చేశారు. రేర్ కేసులో మాత్రమే కోర్టులు ఇన్వాల్వ్ అవ్వాలి. ఇలాంటి అవినీతి కేసులో కాదు. పిటిషన్ ను డిస్మిస్ చెయ్యాలి. ఛార్జిషీట్ రెడీ అయిపోయింది. బెయిల్ పిటిషన్ లో వాదనలు వినిపించుకోవాలి. సుబ్బారావు ప్రభుత్వ ఉద్యోగి కాదు. ఐటీ ఉద్యోగి. క్వాష్ పిటిషన్ వేశారు, బెయిల్ పిటిషన్ వేశారు, కింది కోర్టులో పిటిషన్ వేశారు. ఇలా పలు పిటిషన్లు వేసి కోర్టు కాలాన్ని వృథా చేస్తున్నారు” అని వాదనలు వినిపించిన ముకుల్ రోహత్గీ అసలు స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం ఎలా జరిగిందో కోర్టుకి వివరించారు.

ఆ నిబంధన వర్తించదు అనడం సరికాదు- హరీశ్ సాల్వే
చంద్రబాబు కేసులో సెక్షన్ 17A వర్తిస్తుంది. 2018 చట్ట సవరణ తర్వాత రిజిస్టర్ అయిన ప్రతి FIRకు సెక్షన్ 17A (అవినీతి నిరోధక చట్టం) వర్తిస్తుంది. నేరం ఎప్పుడు జరిగిందన్నది కాకుండా.. కేసు పెట్టేందుకు మూలమైన టైమ్ ను దృష్టిలో పెట్టుకోవాలి. ఆ టైంలో చంద్రబాబు CMగా ఉన్నారు కాబట్టి అరెస్టు చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి. ఇప్పుడు పదవిలో లేరు కాబట్టి నిబంధన వర్తించదనడం సరికాదు’ అని హరీశ్ సాల్వే కోర్టులో వాదించారు.

ట్రెండింగ్ వార్తలు