Chandrababu : చంద్రబాబు కేసు.. సుప్రీంకోర్టులో విచారణ రేపటికి వాయిదా, జస్టిస్ త్రివేది కీలక వ్యాఖ్యలు

అవినీతి నిరోధక చట్టం 1988 17ఏ సెక్షన్ పరిగణలోకి తీసుకోకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారని సాల్వే వాదించారు. సెక్షన్ 17 ఏ విధివిధానాలు పాటించలేదని, అనుమతులు తీసుకోలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. Chandrababu

Chandrababu Quash Petition

Chandrababu Quash Petition : స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఏ కోర్టులోనూ ఊరట లభించలేదు. చంద్రబాబు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. అటు బెయిల్, కస్టడీ పిటిషన్లను విజయవాడ ఏసీబీ కోర్టు సైతం డిస్మిస్ చేసింది. ఇక సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ రేపటికి (అక్టోబర్ 10) వాయిదా పడింది.

స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధ బోస్, జసిస్ట్ బేలా ఎం త్రివేదితో కూడిన ధర్మాసనం ఈ కేసుపై విచారణ చేపట్టింది.

Also Read : కాపుల ఓట్లు చేజారకుండా సీఎం జగన్ మాస్టర్ ప్లాన్

ఇవాళ(అక్టోబర్ 9) సుప్రీంకోర్టులో రెండున్నర గంటల పాటు వాదనలు వినిపించారు చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే. అవినీతి నిరోధక చట్టం 1988 17ఏ సెక్షన్ పై వాదనలు వినిపించారు హరీశ్ సాల్వే. అవినీతి నిరోధక చట్టం 1988 17ఏ సెక్షన్ పరిగణలోకి తీసుకోకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారని సాల్వే వాదించారు. సెక్షన్ 17 ఏ విధివిధానాలు పాటించలేదని, అనుమతులు తీసుకోలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు అరెస్ట్ రాజకీయ ప్రతీకార చర్యగా స్పష్టంగా ఉందని సాల్వే చెప్పారు. 2018 జులై 15న కేసు దర్యాప్తు ప్రారంభించామంటున్నారు. కానీ, రిమాండ్ రిపోర్టులో సెప్టెంబర్ 5 2021లో కేసు దర్యాప్తు జరిగినట్లు ఉందన్నారు.

Also Read : చంద్రబాబుకు షాకిచ్చిన హైకోర్టు, ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేత

రేపు(అక్టోబర్ 10) ఉదయం 10:30కి ప్రభుత్వం తరపు వాదనలు వినిపించనున్నారు న్యాయవాది ముకుల్ రోహత్గి. చంద్రబాబు కేసు విచారణ సందర్భంగా జస్టిస్ బేలా ఎం త్రివేది కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతి నిరోధక చట్టం 17Aని అన్వయించేటప్పుడు, చట్టం ప్రధాన లక్ష్యం అవినీతిని నిరోధించడం అన్నది చూడాలన్నారు. చట్టం లక్ష్యాన్ని భంగపరిచే వివరణను స్వీకరించలేమని జస్టిస్ బేలా ఎం త్రివేది అన్నారు.

ఇవాళ సమయం ముగియడంతో కేసు విచారణను ధర్మాసనం రేపటికి వాయిదా వేసింది. రేపు కూడా వాదనలు కొనసాగనున్నాయి. ఈ కేసులో అందరికీ బెయిల్ వచ్చిందని కోర్టుకు సాల్వే తెలిపారు. ఈ విధంగా అరెస్టులు చేయడం చట్ట విరుద్ధమన్నారు. మరోవైపు ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ రేపు వాదనలు వినిపించనున్నారు.

అటు ఏపీ హైకోర్టులోనూ చంద్రబాబుకి ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్, అంగళ్లు అల్లర్ల కేసుల్లో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇక, విజయవాడ ఏసీబీ కోర్టులోనూ చంద్రబాబుకి నిరాశే ఎదురైంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. ఇదే సమయంలో సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పొడిగింపు పిటిషన్ ను కూడా కోర్టు డిస్మిస్ చేసింది. దీంతో చంద్రబాబుపై దాఖలైన పీటీ వారెంట్లపై ఏసీబీ కోర్టులో విచారణ ప్రారంభమైంది.

ట్రెండింగ్ వార్తలు