Chandrababu shares about his friendship with Rajasekhar Reddy
Chandrababu : బాలయ్య హోస్ట్ గా ఆహాలో చేసిన అన్‌స్టాపబుల్ షో భారీ హిట్ అయి రికార్డులని కూడా సాధించడంతో ఈ షోకి సీజన్ 2ని కూడా ప్రకటించి గ్రాండ్ లాంచ్ చేశారు. అన్‌స్టాపబుల్ సీజన్ 2 లో మొదటి ఎపిసోడ్ లో అందర్నీ ఆశ్చర్యపరిచే విధంగా చంద్రబాబు, లోకేష్ ని తీసుకొచ్చారు. ఇటీవల దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా, తాజాగా నేడు ఆహాలో మొదటి ఎపిసోడ్ ని రిలీజ్ చేశారు. ఎపిసోడ్ రిలీజైన కొద్దిసేపటికే ఇది వైరల్ గా మారింది.
ఇక మొదటి ఎపిసోడ్ లో మాజీ సీఎం, బాలకృష్ణకు బావ అయిన చంద్రబాబు నాయుడుకి బాలకృష్ణ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. షోలో ఎన్నో సరదా విషయాలు, రాజకీయాలు మాట్లాడారు. ఒకప్పుడు చంద్రబాబుకు ప్రత్యర్థిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి ప్రస్తావన కూడా రావడం గమనార్హం. బాలకృష్ణ చంద్రబాబుని మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరున్నారు అని అడిగారు.
చంద్రబాబు తన ఫ్రెండ్స్ గురించి చెప్తూ.. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఫ్రెండ్స్ మారుతూ ఉన్నారు. స్కూల్ సమయంలో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. యూనివర్సిటీల్లో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పటికి కూడా కొంతమంది స్నేహితులు అప్పటి నుంచి కొనసాగుతున్నారు. ఇక రాజకీయాల్లోకి వచ్చాక రాజశేఖర్ రెడ్డి, నేను బాగా కలిసి తిరిగేవాళ్ళం. ఎమ్మెల్యేలు, మంత్రులుగా కలిసి ఎన్నో పోరాటాలు చేశాము. కలిసి తిరిగాము. మా ఇద్దరిరి స్నేహం రాజకీయాల్లోనే మొదలైంది. బాగా క్లోజ్ అయ్యాము. కానీ ఆ తర్వాత నేను తెలుగుదేశంలోకి వచ్చాక రాజకీయంగా ఫైట్ చేసుకున్నాం. నాకు, ఆయనకి రాజకీయంగా విభేదం ఉంది తప్ప పర్సనల్ గా మేమిద్దరం మంచి స్నేహితులం. ఫ్రెండ్షిప్ అనేది ఎప్పటికైనా ఉపయోగపడుతుంది అని తనకి, రాజశేఖర్ రెడ్డికి మధ్య ఉన్న స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు.